ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ చివరికి ఇంగ్లాండ్ వశం అయింది అన్న విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మకమైన 5వ టి20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా సిరీస్ 2-2 తో సిరీస్ సమం చేసింది. మొదటిసారి చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీమిండియాకు నిరాశ తప్పలేదు అని చెప్పాలి. ఏకంగా 378 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు కాపాడుకోలేక పోయింది.. ఇక ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించడంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి. ఇటీవలే  ఈ టెస్ట్ మ్యాచ్ పై స్పందించాడు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఎబి డివిలియర్స్.


 ఈ సందర్భంగా మొదటిరోజు ఇన్నింగ్స్ లో భాగంగా టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు ఏబి డివిలియర్స్. 111 బంతుల్లో రిషబ్ పంత్ 146 పరుగులు చేయడంతో ఆ తర్వాత అది జోరు కొనసాగించినా రవీంద్ర జడేజా 104 పరుగులతో వీరోచిత సెంచరీలతో కదంతొక్కిన  విషయం తెలిసిందే. 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును సృష్టించారు. ఈ క్రమంలోనే ఇటీవల రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్  స్పందించిన ఎబి డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను వేరే పనుల్లో బిజీగా ఉండటం కారణంగా ఇంగ్లాండ్ భారత్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ను మిస్సయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు ఏబి డివిలియర్స్. కానీ మ్యాచ్ హైలెట్స్ మాత్రం చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో తీవ్ర ఒత్తిడిలో ఉండి కూడా ఇంగ్లండ్ పై కౌంటర్ అటాచ్ చేస్తూ రిషబ్ పంత్,  రవీంద్ర జడేజా నెలకొల్పిన భాగస్వామ్యాన్ని టెస్ట్ క్రికెట్ లో ఇప్పటివరకు తాను చూడలేదు అంటూ తన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అద్భుతమైన షాట్ లతో రిషబ్ పంత్ రవీంద్ర జడేజా ఆకట్టుకున్నారు. వారి ఇన్నింగ్స్ నన్ను ఆశ్చర్యపరిచింది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Abd