టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లైఫ్ లో ఇంతటి పరిస్థితి ఎదురవుతుందని ఎవ్వరూ ఉహించి ఉండరు. ప్రస్తుతం జట్టులో ఉన్న కోహ్లీ దారుణమైన స్థితిలో ఉన్నాడు. మూడు సంవత్సరాల క్రితం చూసుకుంటే కోహ్లీ కి ఏ ఫార్మాట్ లో అయినా బౌలింగ్ వేయాలంటే బౌలర్లు భయపడే వారు. ఎందుకంటే తన బ్యాట్ నుండి చూడముచ్చటైన అన్ని రకాల షాట్ లు కళాత్మకంగా ఆడేవాడు. నిలబడితే... సెంచరీ చేసేవాడు. కానీ 2019 నవంబర్ నుండి కోహ్లీ రాత పూర్తిగా మారిపోయింది. అప్పటి నుండి నిన్న ముగిసిన ఇంగ్లాండ్ టెస్ట్ వరకు ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ అదే నిజం... ఎందుకో కోహ్లీ పేలవమైన ఫామ్ ను కొనాగిస్తున్నాడు.

తనకు బాగా కలిసి వచ్చిన ఐపీఎల్ లోనూ జోరు చూపించలేక చతికిలబడ్డాడు. అయితే ఇప్పుడు తనకు కూడా ఇండియాలో చోటు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అందులో భాగంగా రేపటి నుండి మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే లు ఆడనుంది. ఇందులో కోహ్లీ మొదటి రెండు టీ 20 లకు వ్యక్తిగత కారణాల వలన దూరం అయ్యాడు. కాగా మూడవ మ్యాచ్ నుండి వన్ డే లలో ఆడనున్నాడు. ఈ నాలుగు మ్యాచ్ లలో కనుక కోహ్లీ కనీసం ఒక్క సెంచరీ అయినా సాధించకపోతే కోహ్లీ పై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఎందుకంటే... ఇప్పుడు టీమ్ ఇండియా నిండా యువకులతో కూడిన పోటీ ఎక్కువగా ఉంది.  ముఖ్యంగా దీపక్ హూడా నుండి ఎందరికో ఇబ్బంది కలుగుతుంది. అందుకే టైం కు కోహ్లీ పై సెలెక్టర్లు టార్గెట్ చేశారు. మరి కోహ్లీ పూర్వపు ఫామ్ ను అందుకుని జట్టులో మళ్ళీ రెగ్యులర్ ప్లేయర్ గా కొనసాగుతాడా లేదా అన్నది చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: