ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ తీవ్ర స్థాయిలో నిరాశ పరుస్తున్నాడు  ఈ క్రమంలో అతనిపై ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. కోహ్లీ పేలవమైన ఫామ్ తో నిరాశపరుస్తున్నప్పటికి అతనికి మాత్రం బీసీసీఐ వరుస అవకాశాలు ఇస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కోహ్లీ ఎన్ని సార్లు ఫెయిల్ అవుతున్నప్పటికీ ఎందుకు బీసీసీఐ అతనికి ఇంతలా అవకాశాలు ఇస్తుంది అన్న ప్రశ్న కూడా ప్రతి ఒక్కరిలో కూడా మెదులుతుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే ఇదే విషయంపై ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్స్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 కోహ్లీ వరుసగా విఫలమవుతున్న అతని భారత జట్టులో కొనసాగించడానికి గల కారణాలు వెల్లడించాడు. కోహ్లి జట్టులోకి తీసుకోకపోతే ఆర్థికంగా బిసిసీఐ భారీగా నష్టపోతుంది. అతనికి అభిమానులు అండ బలంగా ఉంది. కోహ్లీ లేని మ్యాచ్ ను చూడటానికి అటు క్రికెట్ ప్రేక్షకులు కూడా పెద్దగా ఆసక్తి చూపరు. ఇక దీని ప్రభావం అతి స్పాన్సరర్ల పై పడుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఇది బిసిసిఐకి భారీ నష్టాన్ని కలిగిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు మాంటీ పనేసర్. అందుకే అతను వరుసగా విఫలమవుతున్న జట్టు నుంచి తొలగించే సాహసం చేయకపోవచ్చును అంటూ చెప్పుకొచ్చాడు.


 అంతే కాకుండా విరాట్ కోహ్లీ ఆడని మ్యాచ్లకు స్పాన్సర్లు కూడా రారేమో అని బిసిసిఐ ఆలోచిస్తుందేమో అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఈ సందర్భం గా క్రిస్టియానో రోనాల్డో ఉదంతాన్ని కూడా ఉదాహరణ గా చూపించాడు. మాంచెస్టర్ యునైటెడ్ సాగర్ క్లబ్ తరఫున క్రిస్టియానో రోనాల్డో ఆడుతుంటే కోట్ల మంది అభిమానుల చూస్తారు. అతను లేకపోతే మ్యాచ్ చూడడానికి కూడా ఎవరూ రారు  కోహ్లీ ఎపిసోడ్ కూడా ఇంతే అని చెప్పుకొచ్చాడు. స్పాన్సర్స్ ను హ్యాపీగా ఉంచడానికి బీసీసీఐ విరాట్ కోహ్లీని  కొనసాగిస్తున్నట్లు భావించాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: