ఇటీవల కాలంలో క్రికెట్ లో స్విచ్ షాట్ అనేది ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఎంతో మంది మాజీ ఆటగాళ్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు కూడా ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రపంచ క్రికెట్లో ఎన్నో ఏళ్ల నుంచి కవర్ డ్రైవ్, స్ట్రెయిట్ డ్రైవ్, కట్ షాట్, స్వీప్ షాట్, రివర్స్ స్వీప్ షాట్ లాంటివి సాంప్రదాయంగా వస్తున్నవే. ఎక్కువ మంది బ్యాట్స్మెన్లు  కూడా ఇలాంటి షాట్స్ ఆడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం హెలిక్యాప్టర్, స్విచ్ షాట్ అనే పదాలు క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.


 అయితే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హెలికాప్టర్ షాట్ కనిపెడితే,  ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ కెవిన్ పీటర్సన్ స్విచ్ షాట్ కు తెర మీదకు తీసుకువచ్చాడు  అయితే స్విచ్ షాట్ అనేది మాత్రం కాస్త వినూత్నమైనది అని చెప్పాలి  బౌలర్ బంతి విడుదల చేయగానే బ్యాట్స్ మెన్ తన పొజిషన్ రివర్స్ చేసి  స్విచ్ షాట్ 2006లో కెవిన్ పీటర్సన్, శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఆడుతూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించటం చేసారు. ప్రస్తుత కాలంలో  డేవిడ్ వార్నర్ గ్లెన్ మ్యాక్స్ వెల్  ఎక్కువ సందర్భాల్లో స్విచ్ ఆఫ్ ఆడారు.


 స్విచ్ షాట్ పై ఇప్పటి వరకు ఐసీసీకి ఎన్నోసార్లు ఫిర్యాదులు వెళ్లాయి. స్విచ్ షాట్ ని బ్యాన్ చేయాలంటూ ఎంతో మంది ఆటగాళ్లు కోరారు. అంతేకాదు స్విచ్ హాట్ ఆడే సమయంలో పొజిషన్ మార్చినప్పుడు  షాట్ ఆడటం మిస్ అయితే ఎల్ బి డబ్ల్యు   ఇచ్చే అవకాశం ఎందుకు లేదు అంటు మరికొంతమంది బౌలర్లు కూడా ప్రశ్నించారు. ఇటీవలే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం షాకింగ్ కామెంట్స్ చేశాడు.


బ్యాట్స్మెన్ స్వీప్ షాట్ ఆడటం లో మాకు ఇబ్బందులు లేవు. ఒకవేళ ఆ సమయంలో బంతి మిస్ అయితే మాత్రం ఎల్ బి డబ్ల్యు  ఇవ్వాల్సిందే.  ఎందుకు ఇవ్వకూడదు అనే విషయాన్ని నాకు చెప్పాలి. పొజిషన్ మార్చినప్పుడు బంతి నేరుగా వికెట్లకు వెళ్తుంది. కచ్చితంగా ఎల్బిడబ్ల్యు ఇవ్వాల్సిన  అవసరం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే విషయం పై మాట్లాడిన ఇంగ్లాండ్ మాజీ ఆల్రౌండర్ స్కాట్ స్టైరీష్ స్విచ్ చాట్ బ్యాన్ చేస్తే ఎక్కువ సంతోషించేది నేనే  ఎందుకంటే ఆ షాట్ ఎప్పటికీ బౌలర్లకు ప్రమాదకరం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: