ప్రస్తుతం టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ఆడుతుండగా యువ ఆటగాళ్లు అందరూ కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల వెస్టిండీస్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ 63 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పేలవమైన ఫామ్ లో ఉన్నాడు అంటూ విమర్శలు ఎదుర్కొన్న శ్రేయాస్ అయ్యర్ ఇక రెండో వన్డే మ్యాచ్లలో రెండు అర్థ సెంచరీలు నమోదు చేసి సత్తా చాటాడు అని చెప్పాలి. అయితే ఇటీవలే శ్రేయస్ అయ్యర్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 అతను చేసిన అద్భుత బ్యాటింగ్ కు సంబంధించి కాదు అతను పెట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కు సంబంధించి  ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సాధారణంగా క్యాచ్ లు పట్టిన సమయం లో ప్రతి క్రికెటర్ కూడా ఎంతో ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ చేసుకోవడం చూస్తూ ఉంటాము అన్న విషయం తెలిసిందే. ఇక్కడ కూడా ఇలాంటిదే జరిగింది. మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో పట్టిన ఓ క్యాష్ నెట్టింట్లో చర్చల్లోకి వచ్చింది అని చెప్పాలి. క్యాచ్ పట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్ విచిత్రమైన హావభావాలతో సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో  ట్విట్టర్ లో చక్కర్లు కొడుతుంది.


 13 పరుగుల వద్ద శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో రోమన్ పావెల్ ఇచ్చిన క్యాచ్ను శ్రేయస్ అయ్యర్ అదిరిపోయే డైవ్ చేస్తూ పట్టుకున్నాడు. ఇక క్యాచ్ పట్టుకున్న అనంతరం సైలెంట్ గా ఉండాలి అంటూ సిగ్నల్ ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్. అయితే మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై మాట్లాడుతూ శ్రేయస్ అయ్యర్  తాను సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వెనుక ఉన్న కారణం ఏంటో చెప్పుకొచ్చాడు. క్యాచ్ పట్టుకో వద్దు అంటూ ప్రేక్షకులు తనను ఆటపట్టిస్తున్నారు. అందుకే క్యాచ్ తీసుకున్న తర్వాత ఇలా చేశాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: