ఒకప్పుడు సుదీర్ఘమైన టెస్టు ఫార్మాట్, 50 ఓవర్ల తో కూడిన వన్డే ఫార్మాట్ మాత్రమే ప్రపంచ క్రికెట్లో ఉండేవి అన్న విషయం తెలిసిందే. మొదటి సారి 2005లో టి 20 ఫార్మాట్  ప్రపంచ క్రికెట్లో పరిచయమైంది. అయితే కొత్త ఫార్మాట్ కావడంతో ప్రేక్షకుల నుంచి పెద్దగా ఆదరణ కూడా ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే 2007 లో భారత జట్టు టి20  ప్రపంచకప్ ఎగరేసుకుపోయిందో అప్పుడే ఈ ఫార్మాటు అందరికీ ఆసక్తి పెరిగిపోయింది. ఇక 2008లో భారత్లో ఐపీఎల్ ప్రారంభం కావడంతో టీ20 ఫార్మాట్ కి ఒక బలమైన పునాదిగా మారిపోయింది. ఇక అప్పటినుంచి టి20 ఫార్మాట్   వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్ తరహాలోనే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా టి20 లీగ్ లో నిర్వహిస్తున్నాయి.


 కాగా దక్షిణాఫ్రికా కూడా టీ20 ఛాలెంజ్ పేరుతో ఒక లీగ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. కాగా  గ్రేమ్ స్మిత్ ఇక ఈ టోర్నమెంట్ కు అధిపతిగా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే టీ20 ఫార్మాట్కు ఇటీవలికాలంలో విశేషమైన ఆదరణ రావడానికి గల కారణం ఏంటి అన్న విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్  వల్లే టి20 ఫార్మాట్ కు విశేష ప్రజాదరణ దక్కిందని గ్రేమ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. టీమిండియా దక్షిణాఫ్రికా జట్ల మధ్య 2006లో జరిగిన తొలి టీ-20 మ్యాచ్లు మరోసారి వీడియోలు వీక్షించాడట.


 భారత్లో ఆడిన తొలి టీ-20 మ్యాచ్ నాకు ఇంకా గుర్తు ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో దినేష్ కార్తీక్ అద్భుతంగా ఆడి టీమిండియాను గెలిపించాడు. మాకు అదే మొదటి టి20 మ్యాచ్ కావడంతో ఆరంభంలో జట్టులోని ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చేవాళ్ళం. అయితే కాలం గడిచే కొద్దీ ప్రేక్షకాదరణ పెరిగింది  ఇక క్రికెట్ అభిమానులు కూడా ఈ ఫార్మాటు ఇష్టపడుతున్నారని గ్రహించి ఆ ఫార్మాట్  కి అలవాటు పడడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఇక ఒత్తిడి లేకుండా ఆడేందుకు అదొక మంచి అవకాశంగా మారిపోయింది. 2006లో తొలి మ్యాచ్ ఆడేటప్పుడు మాత్రం టీ-20 ఫార్మెట్ ఈ స్థాయికి చేరుకుంటుందని అస్సలు ఊహించలేదు. ఐపీఎల్ రాకతో పొట్టి ఫార్మాట్ ఫేట్ మారిపోయింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా టి20 ఫార్మాట్ పాకిపోతోంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: