గత కొంత కాలం నుంచి మంచి ఫాంలో కొనసాగుతున్న టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ ఇక వెస్టిండీస్ పర్యటనలో కూడా భారత జట్టులో అవకాశం దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే.  విండీస్ పర్యటనలో భాగంగా మొదట భారత జట్టు వన్డే సిరీస్ ఆడింది టీమిండియా. వన్డే సిరీస్ లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన చేసిన టీమిండియా వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి సత్తా చాటింది అన్న విషయం తెలిసిందే.  అయితే తొలి రెండు వన్డేల్లో కాస్త కష్టంగానే విజయం సాధించిన టీమిండియా ఇక మూడో వన్డే మ్యాచ్లో మాత్రం ఎంతో అలవోకగా ఆధిపత్యాన్ని కొనసాగించింది.


 ఈ క్రమంలోనే విజయం సాధించి ఇక వెస్టిండీస్ జట్టును సొంతగడ్డపైనే క్లీన్స్వీప్ చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే మూడో వన్డే మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్.  98  పరుగులు చేసి సెంచరీ చేసేలాగే కనిపించాడు. కానీ రెండు పరుగుల దూరంలో సెంచరీ మిస్ చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా అడుగు దూరంలో  సెంచరీ మిస్ అయితే ఆ బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి. ఇక ఇప్పుడు సెంచరీ మిస్  అవడం పై శుబ్ మన్ గిల్ తెగ బాధపడిపోయాడు.


 ఒక ఓవర్ అదనంగా ఉండి ఉంటే  సెంచరీ సెంచరీ సాధించే వాడిని. 99 పరుగుల వద్ద ముగించాలని దేవుడు రాసి పెట్టి ఉన్నట్టున్నాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు శుబ్ మన్ గిల్. అయినప్పటికీ పర్వాలేదని నా ఇన్నింగ్స్ తో టీమిండియాకు మాత్రం విజయం అందించగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటి వరకు ఈరోజు ఇన్నింగ్స్ నా కెరియర్ లోనే ది బెస్ట్ అనడంలో సందేహం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇదే వన్డే సిరీస్లో ఇక మొదటి వన్డే మ్యాచ్లో భాగంగా కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా 97 పరుగుల వద్ద సెంచరీ మిస్ చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. ఇక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన శుబ్ మన్ గిల్ పై ప్రస్తుతం మాజీ ఆటగాళ్లు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gil