మొన్నటివరకు టీమిండియాకు దూరమైన శిఖర్ ధావన్ ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జట్టులో అవకాశం దక్కించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇంగ్లండ్ పర్యటనలో తన ప్రదర్శన తో అంతలా ఆకట్టుకోలేకపోయాడు. అయితే భారత జట్టులోకి వచ్చాడో లేదో అటు వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టుకు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. భారత జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టి ఇక వన్డే సిరీస్లో జట్టును ముందుకు నడిపించాడు. ఇక ఇలా వెస్టిండీస్ గడ్డపై ఒకవైపు కెప్టెన్గా మరోవైపు ఒక బ్యాట్స్ మెన్ గా కూడా గబ్బర్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు అని చెప్పాలి.


 మొదటి మ్యాచ్లో 97 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు శిఖర్ధావన్. ఇక ఇటీవల జరిగిన మూడో వన్డే మ్యాచ్లో కూడా 74 బంతుల్లో 58 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అదే  సమయంలో జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించి అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇప్పటికే వెస్టిండీస్ గడ్డపై ఆతిథ్య వెస్టిండీస్ జట్టును క్లీన్స్వీప్ చేసిన తొలి ఇండియన్ కెప్టెన్గా రికార్డు సృష్టించిన శిఖర్ ధావన్ ఇక మూడో మ్యాచ్లో హాఫ్ సెంచరీ కారణంగా మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు అన్నది తెలుస్తుంది.


 ఇటీవలే మూడో మ్యాచ్లో అర్థ సెంచరీ చేయడంతో అది శిఖర్ ధావన్ కెరీర్ లో 29వ అర్థ సెంచరీగా నిలిచింది. దీంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును సమం చేశాడు శిఖర్ ధావన్. ఇప్పటివరకు భారత్ నుంచి అత్యధిక అర్థసెంచరీలు చేసిన వారిలో విరాట్ కోహ్లీ 49 అర్ధ సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నాడు అని చెప్పాలి. ఆ తర్వాత స్థానాల్లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి క్రికెటర్లు ఉన్నారు. కాగా మహేంద్ర సింగ్ ధోనీ 29 అర్థ సెంచరీలతో  ఈ లిస్టులో కొనసాగుతుండగా ఇటీవలే శిఖర్ ధావన్ కూడా తన కెరీర్లో 29వ అర్థసెంచరీ సాధించి ధోని రికార్డును సమం చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: