గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ వైఫల్యాలతో తీవ్ర ఇబ్బందులు పడిపోతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు అలవోకగా పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు మాత్రం అదే దూకుడు కొనసాగించలేక పోతున్నాడు. గత మూడేళ్ళ నుంచి సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ అడపాదడపా హాఫ్ సెంచరీలతో సరిపెట్టుకుంటున్నాడు. గత కొంత కాలం నుంచి అయితే హాఫ్ సెంచరీ కూడా దిక్కు లేదు అని చెప్పాలి. తక్కువ పరుగులు చేసి వికెట్ కోల్పోతున్న నేపథ్యంలో ఇక ఎంతో మంది మాజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.


 విరాట్ కోహ్లీని  జట్టు నుంచి తప్పించాల్సిన అవసరం ఉందని కొంతమంది అంటుంటే.. కొన్నాళ్ల పాటు విశ్రాంతి ఇస్తే అతను మళ్ళీ మునుపటి ఫాంలోకి వస్తాడని మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారూ. ఇక అదే సమయంలో విరాట్ కోహ్లీ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదంటూ మరికొంత మంది అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఇటీవల ఇంగ్లాండ్లో పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన  విరాట్ కోహ్లీ వెస్టిండీస్ పర్యటనలో విశ్రాంతి ఇచ్చారు. అయితే వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా వెళ్లబోయే జింబాబ్వే పర్యటనలో కోహ్లీని సెలెక్ట్ చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.


 ఇకపోతే జింబాబ్వేలో కోహ్లీ రాణించడంపై ఇటీవలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్. కోహ్లీకి కోచ్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ అండగా ఉండటం మంచి విషయం. కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని ఎంతోమంది సూచిస్తున్నారు. అయితే జింబాబ్వేతో వన్డేలు ఆడించాలని  కొంతమంది అంటున్నారు.  జింబాబ్వే  లో విరాట్ కోహ్లీ ఎంతో అలవోకగా సెంచరీ కొట్టగలడు. కానీ అతనికి పెద్దగా ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో జింబాబ్వే జట్టు ను తక్కువ చేయడం కాదు.. కోహ్లీ మళ్లీ ఫామ్ లోకి రావాలంటే జింబాబ్వే తో ఆడాల్సిన అవసరం లేదు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే  సరిపోతుంది అని స్కాట్ స్టైరిష్  చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: