ఇటీవలి వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా ఎంత అద్భుతమైన ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీనియర్లకు  విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో యువకులతో బరిలోకి దిగింది టీమిండియా. అయినప్పటికీ వెస్టిండీస్ జట్టును ఓడించి వన్డే సిరీస్ను కైవసం చేసుకుంది. నామ మాత్రమైనా  మూడో మ్యాచ్ లో కూడా విజయం సాధించి ఇక 3-0 ఆతిథ్య వెస్టిండీస్ జట్టును క్లీన్స్వీప్ చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదట వన్డే సిరీస్ గెలిచిన జోరులో ఉన్న టీమ్ ఇండియా టి20 సిరీస్ లో కూడా అదే రీతిలో రాణించేందుకు సిద్ధమైంది. సీనియర్ ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఇండియా మరింత పటిష్టంగా మారిపోయింది.



 కాగా నేడు జరగబోయే మ్యాచ్లో టీమ్ ఇండియా శుభారంభం చేస్తుందని  అటు భారత అభిమానులు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు అని చెప్పాలి. ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ నేపథ్యంలో తమ అత్యుత్తమ జట్టును సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమై ఉంది టీమిండియా. కాగా నేడు రాత్రి 8:00 గంటల  నుంచి ఇక వెస్టిండీస్ టీమ్ ఇండియా మధ్య మొదటి టి20 మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. వన్డే సిరీస్ లోని చివరి మ్యాచ్ కు చాలాసార్లు వర్షం అంతరాయం కలిగించింది. ఇక మొదటి టి20 మ్యాచ్ కి ఏదైనా అంతరాయం కలుగుతుందా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది.


 మూడో వన్డేలో తలెత్తిన పరిస్థితులే మొదటి టి20 మ్యాచ్ లో కూడా తలెత్తే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇప్పటికే టి20 మ్యాచ్ జరగబోయే ప్రాంతంలో మబ్బులు కమ్ముకున్నాయి. 24 నుంచి 52 శాతం వర్షం కురుస్తోంది అన్నది తెలుస్తుంది. కనీసం గంట పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. ఇదే జరిగితే ఇక మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అంతే కాదు ఓవర్ లూ కుదించాల్సి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలా మొదటి టి20 మ్యాచ్ కి వరుణుడి గండం పొంచి ఉంది అని చెప్పాలి. మరి ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: