కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా అద్భుతమైన ప్రదర్శన చేసి సత్తా చాటాలని భావించిన భారత మహిళల జట్టుకు మొదటి అడుగులోనే చేదు అనుభవం ఎదురైంది అన్న విషయం తెలిసిందే. టి20 టోర్నీలో భాగంగా అటు మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది భారత జట్టు. ఇక చివరి వరకు ఎంతో హోరాహోరీగా పోరాడినప్పటికీ భారత జట్టుకు మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తప్పలేదు అనే చెప్పాలి. అయితే భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 52 పరుగులు షఫాలి వర్మ 48 పరుగులతో రాణించారూ. దీంతో  నిర్ణీత 20 ఓవర్లలో 154 పరుగులు చేసింది భారత జట్టు. ఇక మెరుగైన టార్గెట్ కావడంతో భారత బౌలింగ్ విభాగం ఈ టార్గెట్ ని కాపాడితే సరిపోతుంది అని అందరూ అనుకున్నారు.


 కానీ ఊహించని రీతిలో భారత బౌలర్లు చేతులెత్తేయడంతో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. అయితే 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది ఆస్ట్రేలియా జట్టు. ఇలాంటి సమయంలో భారత్ విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు. ఇలాంటి ఈ సమయంలోనే అప్లి గార్డ్నర్ 52 పరుగులు గ్రేస్ హ్యరీష్ 37 పరుగులతో జట్టును ఆదుకున్నారు. క్రమక్రమంగా ఇక విజయావకాశాలను తమ వైపుకు మలుపుకుంటూ చివరికి విజయం సాధించింది ఆస్ట్రేలియా జట్టు. అయితే భారత్ ఇన్నింగ్స్ వికెట్ నష్టానికి 65 పరుగుల తో ఉన్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.


 ఆస్ట్రేలియా బౌలర్ తాళి మెక్ గ్రాత్ బౌలింగ్ లో షెఫాలీ వర్మ ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించింది. అయితే బాల్ బీట్ కీపర్ అలిస్సా హీలీ చేతిలో పడింది. వెంటనే స్పందించిన కీపర్ వికెట్ను గిరాటేసింది. అయినా అంపైర్   మాత్రం నాటౌట్గా ప్రకటించాడు. దీనికి కారణం బంతి ఉన్న చేతితో కాకుండా మరో చేతితో వికెట్లను కొట్టడం గమనార్హం. ఈ క్రమంలోనే థర్డ్ అంపైర్ మరోసారి ఈ విషయాన్ని పరిశీలించి ధ్రువీకరించి నాట్ ఔట్ ఇచ్చాడు అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిస్సా హీలీ ఇక ఇలా చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: