టీమిండియాలో ఎన్నో ఏళ్ల నుంచి కీలక బ్యాట్స్మెన్ లుగా కొనసాగుతున్న రోహిత్ శర్మ తన అద్భుతమైన ప్రతిభతో ఎన్నోసార్లు జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. ఒకవైపు కెప్టెన్సీ తో ఆకట్టుకుంటూనే  మరోవైపు బ్యాటింగ్ లో కూడా తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమ్ ఇండియా ఆడిన వన్డే సిరీస్కు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ టి20 సిరీస్ కు మాత్రం అందుబాటులోకి వచ్చేసాడు.


 ఈ క్రమంలోనే మొదటి టి20 మ్యాచ్ లో మరోసారి తన కెప్టెన్సీని తో మ్యాజిక్ చేసి టీమిండియాకు 68 పరుగులు తేడాతో విజయాన్ని అందించాడు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే రోహిత్ శర్మ అంతర్జాతీయ టి20లో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్  ను అధిగమించి అగ్ర స్థానానికి చేరుకున్నాడు రోహిత్ శర్మ. అయితే మొన్నటి వరకు రోహిత్ శర్మ ఇలా టీ20 లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా ఉన్నప్పటికీ ఇటీవలే మార్టిన్ గప్టిల్ ఈ రికార్డును బ్రేక్ చేసి మొదటి స్థానం లోకి వచ్చాడు. అయితే వెస్టిండీస్తో జరిగిన తొలి టీ-20 మ్యాచ్ లో 64 పరుగులు చేసి  హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు రోహిత్ శర్మ.


 ఈ క్రమంలోనే మరోసారి టాప్ ప్లేస్ లోకి వచ్చేశాడు అని చెప్పాలి. ప్రస్తుతం 3443 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు రోహిత్ శర్మ. ఇక ఇదే లిస్ట్ లో మార్టిన్ గప్టిల్ 3399 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడవ స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 3308 పరుగులతో ఉండడం గమనార్హం. ఐర్లాండ్ కు చెందిన పాల్ స్టెర్లింగ్ రెండు వేల 894 పరుగులతో 4వ స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ 2855 పరుగులతో ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ మరోసారి తన టాప్ ప్లేస్ నిలబెట్టుకున్న నేపథ్యంలో అతనికి అభిమానులందరూ సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్యులేషన్స్ చెబుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: