భారత క్రికెట్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియా లో ఎంట్రీ ఇచ్చి ఇక తనకు తిరుగు లేదు అని నిరూపించుకున్నాడు. సెంచరీలు డబుల్ సెంచరీలతో చెలరేగి పోయినా హిట్ మ్యాన్ టీమ్ ఇండియా లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే  సీనియర్ ఆటగాడిగా ఎదుగుతూ ఇక ఇప్పుడు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను కూడా చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇంతకుముందు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి ఇక రోహిత్ శర్మ ఎంతలా సక్సెస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఓపెనర్ గా బరిలోకి దిగుతూ ఎప్పుడూ భారత జట్టుకు విజయాన్ని అందించేందుకు మంచి ఆరంభ ఇస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. అర్థసెంచరీలు సెంచరీలతో చెలరేగిన పోతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కెప్టెన్ గా మారిన తర్వాత కూడా అదే రీతిలో రాణిస్తూ ఉన్నాడు.  ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో టి20 సిరీస్లో బరిలోకి దిగింది టీమిండియా. ఇక ఇటీవలే మొదటి టి20 మ్యాచ్ కూడా జరిగింది. ఈ మ్యాచ్లో భాగంగా 58 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని సాధించి శుభారంభం చేయడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 64 పరుగులతో ఆకట్టుకున్నారు.



 ఇకపోతే ఇటీవల వెస్టిండీస్తో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లో రోహిత్ శర్మ సాధించిన హాఫ్ సెంచరీతో ఒక అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. ప్రపంచ టి20 క్రికెట్ లో ఎక్కువసార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ లో కి చేరిపోయాడు రోహిత్ శర్మ. రోహిత్ 121 ఇన్నింగ్సులో 31 సార్లు 50+ స్కోర్ చేయగా.. విరాట్ కోహ్లీ 91 ఇన్నింగ్సులో 30 అర్థ సెంచరీలు చేశాడు. బాబర్ 69 ఇన్నింగ్సులో 27 అర్థ సెంచరీలు చేయగా..  డేవిడ్ వార్నర్ 91 ఇన్నింగ్స్ లో 23 అర్థసెంచరీలు .. మార్టిన్ గుప్టిల్ 112 ఇన్నింగ్స్ లో 22 అర్థ సెంచరీలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: