ఇటీవల కాలంలో భారత క్రికెట్ లో శుభమన్ గిల్ ఎంత బాగా రాణిస్తూ ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫార్మా తో సంబంధం లేకుండా అద్భుతంగా రాణిస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని ప్రదర్శనపై ఎంతో మంది ఆటగాళ్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ లో అవకాశం దక్కించుకున్న శుభమన్ గిల్  ఎంతో అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వరుసగా మూడు మ్యాచ్ లలో ఏకంగా 200 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటనలో కెప్టెన్ గా వ్యవహరించిన శిఖర్ ధావన్  శుభమన్ గిల్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు.


 ఏకంగా శుభమన్ గిల్ ను చూస్తూ ఉంటే రోహిత్ శర్మ చూస్తున్నట్లుగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవలే కివీస్ మాజీ ఆల్రౌండర్ స్కాట్ స్టైరీష్  మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అతని బ్యాటింగ్ లో పలు టెక్నికల్ లోపాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రతి ఆటగాడు ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండాలి అనేదానికి ఉదాహరణగా సచిన్ టెండూల్కర్ ఉన్నాడు అని తెలిపాడు. ఎందుకంటే కెరీర్లో 200ల టెస్టులూ ఆడటం అంత సులభమైన విషయం కాదు అంటూ తెలిపాడు.


 అందుకే ఏ ఆటగాడిని కూడా ఇతర ఆటగాళ్ళతో పోల్చకూడదు అలాగే శుభమన్ గిల్ అప్పుడే పరిపూర్ణమైన ఆటగాడు అని చెప్పడం కూడా తొందరపాటు అవుతుంది అంటూ వ్యాఖ్యానించాడు. కాగా ఇటీవలి కాలంలో భారీగా పరుగులు చేస్తే మంచిగా రాణిస్తూ ఉన్నప్పటికీ అతని బ్యాటింగ్ లో కొన్ని లోపాలు ఉన్నాయంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక అవేంటో తొందర్లోనే కనిపెట్టి ప్రత్యర్థి బౌలర్లూ అతన్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా లేకపోలేదు అంటూ తెలిపాడు. అయితే మానసిక స్థితి, పరిణితి, నాయకత్వ ధోరణి లాంటి అంశాలు శుభమన్ గిల్ ఉన్నాయని అనుకుంటున్నాను అంటూ స్కాట్ స్టైరిష్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: