చదరంగం.. ఈ ఆటను ఆడటానికి ఎలాంటి శారీరక శ్రమ అవసరం లేదు.. భారీగా బరువు ఎత్తాల్సిన పని లేదు. కానీ అన్నిటికంటే కష్టమైన ఆట చదరంగం మాత్రమే అని చెబుతూ ఉంటారు ఎంతోమంది.  కారణం ఒకే చోట కూర్చుని కేవలం మైండ్ కు మాత్రమే పని చెప్పాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏకాగ్రత లోపించినా ఇక ప్రత్యర్థి మనకి చెక్మేట్ పెట్టేస్తూ విజయం సాధించడం చేస్తూ ఉంటారూ. అయితే ఒకప్పుడు భారత్ తరఫున గ్రాండ్మాస్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న విశ్వనాథన్ ఆనంద్ పేరు భారత్లో ఎక్కువగా మారుమోగి పోతూ ఉండేది.

 చెస్ ఆట గురించి ప్రస్తావన వస్తే చాలు ఎంతో మంది విశ్వనాథన్ ఆనంద్ ని గుర్తు చేసుకుని వారు. కానీ ఇటీవలి కాలంలో ఎంతోమంది యువత కూడా చదరంగం పోటీలలో సత్తా చాటుతూ గ్రాండ్ మాస్టర్ లుగా అవతరిస్తూ ఉన్నారు. అతి తక్కువ వయస్సులోనే గ్రాండ్ మాస్టర్ గా మారుతూ ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకూ భూమి మీద ఒక చోట కూర్చొని చెస్ ఆడటం అందరూ చూసే ఉంటారు. కానీ సముద్రంలో చెస్ ఆడటం గురించి ఎప్పుడైనా విన్నారా.

 సముద్రం లోపల చెస్ ఆడటం ఏంటి.. ఇదేదో కాస్త విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. చెన్నైలో 44 వ ఒలంపియాడ్ చెస్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఆరుగురు స్థానిక ఆటగాళ్లు వినూత్నంగా ఆలోచించారు. సముద్రం లోపల చెస్ ఆడారు.  తరుణ్ శ్రీ అనే టెంపుల్ అడ్వెంచర్స్ డ్రైవింగ్ సెంటర్ల వ్యవస్థాపకుడు నేతృత్వంలో ఈ పోటీలు జరగడం గమనార్హం. స్థానికంగా ఉన్న నీలంకరై తీరం నుంచి పడవలో సముద్రం ఐదు కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్ళి అక్కడ 60 అడుగుల లోతులో చెస్ గేమ్ ఆడారు. రెండు గంటల పాటు జరిగిన ఈ చెస్ గేమ్ లో భాగంగా 20 నిమిషాలకు ఒకసారి పైకి వచ్చి మళ్లీ నీళ్లలోకి వెళ్లారట. అందుకోసం ప్రత్యేకమైన చెస్ బోర్డు పావులు కూడా రూపొందించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: