రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం భారత క్రికెట్లో మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లో కూడా అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు పరుగుల వరద పారిస్తూ జట్టుకు విజయాన్ని అందించడమే లక్ష్యంగా ప్రదర్శన చేస్తూ ఉంటాడు రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే తన అద్భుతమైన ప్రదర్శన తో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు అని చెప్పాలి. మొన్నటివరకు బ్యాటింగ్ లో రికార్డులు కొల్లగొట్టిన రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్సి చేపట్టిన తర్వాత కెప్టెన్గా కూడా రికార్డుల వేట ప్రారంభించాడు.


 ఇలా ప్రపంచ క్రికెట్ లో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన రోహిత్ శర్మ ఇక ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ మంచి పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు అనుకుంటే గోల్డెన్ డక్ ఔట్ గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే ఒక చెత్త రికార్డు రోహిత్ శర్మ ఖాతలో చేరిపోయింది. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువసార్లు గోల్డెన్ డక్ అవుట్ అయిన రెండవ ఓపెనర్ రోహిత్ శర్మ నిలిచాడు.


 నాలుగు సార్లు డకౌట్ అయిన శ్రీలంక మాజీ క్రికెటర్ దిల్షాన్ ఇక ఓపెనర్గా బరిలోకి దిగి ఎక్కువసార్లు గోల్డెన్ డక్ అవుట్ అయిన బ్యాట్స్మెన్గా ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. ఆరోన్ ఫించ్,  జాసన్ రాయ్ లు మూడుసార్లు డకౌట్ అయ్యి అయితే ఇక ఈ చెత్త రికార్డులో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన రెండో టీ-20 మ్యాచ్లో రోహిత్ శర్మ కూడా ఓపెనర్గా బరిలోకి గోల్డెన్ డకౌట్ గా వెనుదిరగడంతో ఈ చెత్త రికార్డు సాధించిన ఓపెనర్గా రెండవ స్థానంలో కొనసాగుతూ ఉండడం గమనార్హం. కాగా రెండవ టీ 20 మ్యాచ్ ఎంతో హోరాహోరీగా జరుగగా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆతిథ్య వెస్టిండీస్ జట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: