గత కొన్ని నెలల నుంచి విరాట్ కోహ్లీ ఎంతలా వైఫల్యంతో కొనసాగుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెంచరీలతో చెలరేగి  పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ ఇప్పుడు సాదాసీదా పరుగులు చేయడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోజురోజుకు విరాట్ కోహ్లీ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయ్. విరాట్ కోహ్లీ సెంచరీ చేసి కూడా దాదాపు మూడేళ్లు అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ నుంచి ఒక సాలిడ్ ఇన్నింగ్స్ వస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


 ఇలాంటి సమయంలోనే ఎంతో మంచి మాజీ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీకి కొన్నాళ్ల పాటు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉందని కొంతమంది చెబుతుంటే.. కోహ్లీ ని పక్కన పెట్టడం బెటర్ అంటూ మరి కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే విరాట్ కోహ్లీ నేడు అద్భుత ప్రదర్శన చేసిన ఒక అరుదైన ఇన్నింగ్స్ ను అభిమానులు గుర్తు చేసుకుంటూ ఉండటం గమనార్హం. విరాట్ కోహ్లీ పెద్ద చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోవడంతో  గతంలో చేసిన పరుగులను గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు.

 అయితే సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం ఇదే రోజు బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లాండ్,ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది  విరాట్ కోహ్లీ ఎంతో అద్భుతంగా రాణించాడు అని చెప్పాలి. ఏకంగా 149 పరుగులు చేసి అభిమానులందరినీ కూడా ఆనందోత్సాహాల్లో ముంచేశాడు  ఈ క్రమంలోనే సరిగ్గా నాలుగేళ్ల క్రితం విరాట్ కోహ్లీ చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్ ను గుర్తు చేసుకుంటూ అభిమానులు మరోసారి ఇలాంటి విరాట్ కోహ్లీ ని చూడాలని వుంది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: