ఆస్ట్రేలియా క్రికెట్ లో ఎన్నో ఏళ్ల పాటు అద్భుతంగా సేవలు అందించిన మెక్ గ్రాత్ దిగ్గజ క్రికెటర్ గా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. తన బౌలింగ్ ప్రతిభతో అద్భుతంగా రాణిస్తూ ఇక ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో విషయాలను అందజేశాడు. కాగా  ఎంఆర్ఎఫ్ ఫేస్ ఫౌండేషన్ చీఫ్ కోచ్  బాధ్యతలు చేపట్టాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ బాధ్యతలు చేపట్టి ఇప్పటికి పది ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆస్ట్రేలియా దిగ్గజం మెక్ గ్రాత్.


 ఈ క్రమంలోనే భారత యువ ఆటగాళ్లు ప్రసీద్ కృష్ణా,  ఆవేశ్ ఖాన్ లపై ప్రశంసలు కురిపించారు. ఆ ఇద్దరు యువ ఆటగాళ్లు కూడా టీమిండియాకు ఆడుతుంటే ఎంతగానో గౌరవంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రసీద్ కృష్ణ, ఆవేశ్ ఖాన్ లూ చెన్నైలోని ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్ లో శిక్షణ తీసుకున్నారు.. ఈ క్రమంలోనే ఇక ఈ వ్యాఖ్యలు చేశారు ఆస్ట్రేలియా ఫేస్బుక్ దిగ్గజం మెక్ గ్రాత్. కాగా వీరిద్దరితో పాటు మరో 25 మంది ఎన్ఆర్ఐ ఫౌండేషన్ మెక్ గ్రాత్ ఆధ్వర్యంలోని మెళుకువలు నేర్చుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా మెక్గ్రాత్ కోచింగ్ లో మెళకువలు నేర్చుకున్న ఎంతోమంది ఐపీఎల్ లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవల వన్డే క్రికెట్ మనుగడపై జరుగుతున్న చర్చపై కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మెక్ గ్రాత్. బ్యాట్స్మెన్లు పరుగులు చేస్తున్నంత కాలం వన్డే ఫార్మాట్లో ఢోకా ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే డబ్బు శారీరక ఒత్తిడి కారణంగానే ఎంతో మంది ఆటగాళ్లు వన్డేల పై అనాసక్తిని ప్రదర్శిస్తున్నాడని తాను అనుకోవడం లేదని.. అయితే తన దృష్టిలో మాత్రం సాంప్రదాయమైన క్రికెట్ అంటే కేవలం టెస్ట్ ఫార్మాట్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: