సాధారణంగా క్రికెట్ ఆటలో అంపైరింగ్ చేయడం అంత సులువైన విషయం కాదు. మైదానంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్లకు ఇక స్టేడియంలో సీట్లలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు ఎవరు గెలుస్తారో అని ఎంత ఒత్తిడి ఉంటుందో.. అటు వికెట్ల వెనకాల నిలబడి అంపైరింగ్ చేసే వారికి కూడా అంతే ఒత్తిడి ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే మ్యాచ్ స్వరూపం మారిపోతుంది. ఇక ఇలాంటి తప్పుడు నిర్ణయం పట్ల మైదానంలో ఉన్నప్పుడు ఎలాంటి హావభావాలు చూపించకపోయినా మైదానం వెలుపల మాత్రం అంపైర్లు తెగ ఫీల్ అయి పోతూ ఉంటారు అని చెప్పాలి.


 అందుకే ప్రతి బంతిని కూడా ఎంతో నిశితంగా పరిశీలిస్తూ వైడ్, నో బాల్ ఎల్బీ, రన్ అవుట్  విషయంలో సరైన నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. పొరపాటున అంపైర్లు ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారంటే సోషల్ మీడియాలో నెటిజన్లు అందరూ కూడా తిట్టి పోస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు అంపైర్ల తప్పుడు నిర్ణయాలు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఉంటాయ్. మరికొన్ని సార్లు నవ్వులు పూయిస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో లో భాగంగా బంతి బ్యాట్స్మెన్కు చేరకముందే అంపైర్ వైడ్ సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.



 అయితే ఇలా అంపైర్ వైట్ సిగ్నల్ ఇచ్చిన బంతికే బ్యాట్స్మెన్ వికెట్ కోల్పోవడం కూడా గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోని ఇంగ్లాండ్ బార్మీ ఆర్మీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో చూసుకుంటే బౌలర్ లెగ్ సైడ్ అవతల బంతి విసురుతాడు. అయితే బంతి బ్యాట్స్మెన్ వద్దకు చేరుకొకముందే అంపైర్ సిగ్నల్ ఇచ్చేశాడు. బ్యాట్స్మెన్  మాత్రం అదేమీ పట్టించుకోకుండా క్రీజ్ బయటికి వచ్చి షాట్ ఆడాడు. అయితే ఆ షాట్ సరిగా కనెక్ట్ కాలేదు. దీంతో  అక్కడే గాల్లోకి లేచింది. అప్రమత్తమైన వికెట్ కీపర్ ఎంతో సునాయాసంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: