ఇటీవలి కాలం లో టీమిండియాలో అవకాశాలు దక్కించుకుంటున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో ఎలాంటి అనుభవం లేక పోయినప్పటికీ చివరికి అత్యున్నతమైన ప్రతిభ కనబరుస్తున్నారు అని చెప్పాలి. ఇలాంటి వారిలో ఇటీవల టీమిండియా లో అవకాశం దక్కించుకున్న యువ ఆటగాడు అర్షదీప్ కూడా ఉన్నాడు. ఇటీవలే వెస్టిండీస్ పర్యటన లో భాగంగా టీమిండియా ఆడిన టి 20 సిరీస్ లో అవకాశం దక్కించుకున్నాడు అర్షదీప్.


 వచ్చిన అవకాశాన్ని ఎంతో బాగా సద్వినియోగం చేసుకున్నాడు అని చెప్పాలి. అయితే ఈ టి 20 సిరీస్ లో భాగంగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.  ఇక అంతకు ముందే శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా వన్డే సిరీస్ లో కూడా వెస్టిండీస్ ను క్లీన్స్వీప్ చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇండియా లో అవకాశం దక్కించుకున్న బౌలర్ అర్షదీప్ రెండో టీ20 మ్యాచ్లో అదర గొట్టేశాడు. నాలుగు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సిన సమయం లో ఎంతో పొదుపుగా బౌలింగ్ చేశాడు.


 ఈ క్రమం లోనే యువ పేసర్ అర్షదీప్ సింగ్ పై టీమిండియా బౌలింగ్ కోచ్ పరాక్ మాంబ్రే  ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంత ఒత్తిడిలో ఉన్నా అర్షదీప్ ప్రశాంతం గా పోలింగ్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు అంటూ ప్రశంసించాడు. పవర్ ప్లే తో పాటు డెత్ ఓవర్లలో కూడా అతడు ఒత్తిడిని ఎంతో అలవోకగా అధిగమించగలడు. మెరుగైన ఫలితాలను రాబట్టగలడు అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు బౌలింగ్ కోచ్. అతనిలో ఈ సామర్థ్యం ఉందని ఎన్నో రోజుల నుంచి గమనిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తు లో అతను టీమిండియాలో కీలక బౌలర్గా ఎదుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: