భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ ఎంత గొప్ప కెప్టెన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమిండియాను ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా ఉంచేందుకు ఎలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా మహేంద్ర సింగ్ ధోనీ వెనకడుగు వేసే వాడు కాదు అని చెప్పాలి. అయితే ధోనీ హయాంలో ఎన్నో అద్వితీయమైన విజయాలు టీమిండియా సాధించింది. అదే సమయంలో కెప్టెన్సీ లో కొంత మంది ఆటగాళ్లకు తీరని అన్యాయం జరిగిందన్న టాక్ ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

 ఇర్ఫాన్ పఠాన్ : షాకింగ్ ప్రదర్శనతో టీమిండియాలో అవకాశం దక్కించుకొని స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు. సౌరవ్ గంగూలీ  సారథ్యంలో టీమిండియాలో అరంగేట్రం చేయగా రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో కూడా అదరగొట్టాడు. ధోనీ సారథ్యంలో  టి20 ప్రపంచకప్,  కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్లో కూడా ఉన్నాడు. 2009లో ఫామ్ కోల్పోవడంతో అతని పక్కన పెట్టాడు ధోని. ఆ తరువాత 2013 లో చోటుదక్కిన తుది జట్టులో ధోనీ చోటివ్వలేదు. ఇలా అవకాశం కోసం ఎదురు చూస్తూనే అతని కెరీర్ ముగిసిపోయింది.

 మనోజ్ తివారి : పశ్చిమ బెంగాల్ క్రీడాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న మనోజ్ తివారి  ధోని కారణంగా తీరని అన్యాయం జరిగిందన్న టాక్ ఉంది. అతను భారీగా పరుగులు చేసిన దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించిన ధోని సారథ్యంలో  అవకాశాలు అందుకోలేడు. 2008లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుతో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మనోజ్ తివారీ మళ్లీ మూడేళ్ల వరకు భారత జట్టులో కనిపించలేదు. 2011లో మళ్లీ జట్టులోకి వచ్చి సెంచరీతో అదరగొట్టిన మరుసటి మ్యాచ్లోనే అతనికి అవకాశం దక్కలేదు. దీంతో అందరూ అవాక్కయ్యారు.


 రాబిన్ ఉతప్ప  : 20 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి అదరగొట్టిన  రాబిన్ ఉతప్ప 2007 వన్డే ప్రపంచకప్లో ఉన్నాడు. 2007 టీ20 ప్రపంచ కప్ లో కూడా ఎన్నో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఇప్పుడు ధోని కెప్టెన్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తరఫున దేశవాళి క్రికెట్ ఆడుతున్నాడు. 2015 జింబాబ్వే పర్యటన రాబిన్ ఉతప్ప కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: