గత కొంత కాలం నుంచి ఇంగ్లాండ్ క్రికెటర్ లో అందరూ కూడా విరామం లేకుండా వరుసగా మ్యాచ్ లూ ఆడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది క్రికెటర్లు మానసికంగా శారీరకంగా కూడా అలసిపోతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కొంత మంది ఆటగాళ్లు  తమకు కష్టంగా అనిపించిన క్రికెట్ ఫార్మాట్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉండటం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే ఇంగ్లాండ్ క్రికెట్ లో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న బెన్ స్టోక్స్ ఎవరూ ఊహించని విధంగా తన వన్డే క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.


 దీంతో అందరూ షాక్ అయ్యారు. అయితే రానున్న రోజుల్లో మరికొంత మంది క్రికెటర్లు కూడా ఇలాగే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా గత కొంతకాలం నుంచి నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మెన్ జానీ బెయిర్ స్టో సైతం ఇటీవల కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్కు ముందు తాను విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను అంటూ స్పష్టం చేశాడు.  ఈ క్రమంలోనే ఈ ఏడాది ది హండ్రెడ్ టోర్నీలో ఆడబోను అంటూ స్పష్టం చేసాడు.


 ఇటీవలి కాలంలో ఫార్మాట్ తో సంబంధం లేకుండా  క్రికెట్ ఆడుతున్నాడు జానీ బెయిర్ స్టో. అద్భుతమైన ఫామ్లో కొనసాగుతూ అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు అని చెప్పాలి. అయితే గత ఏడాది హండ్రెడ్ ఎడిషన్లో వెల్స్ ఫైవ్ మెన్స్ తరఫున ఆడాడు బెయిర్ స్టో. ఈ టోర్ని ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. సెప్టెంబర్ 3 వరకు జరగనుంది. ఈ క్రమంలోనే ఈ టోర్నీలో తాను ఆడటం లేదు అంటూ స్పష్టం చేశాడు. ఈ టోర్నమెంట్లో భాగం కాలేకపోతున్నందుకు నిరాశ చెందుతున్నా అంటూ చెప్పుకొచ్చాడు. కాగా తీరికలేకుండా క్రికెట్ ఆడాల్సి ఉన్నందున తప్పనిసరిగా రెస్ట్ అవసరం అంటూ పేర్కొన్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: