గత కొంత కాలం నుంచి టీమిండియా బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీమిండియా కష్టాల్లో ఉన్న ప్రతి సారి కూడా తన బ్యాటింగ్తో ఆకట్టుకుంటూ జట్టుకు విజయాన్ని అందిస్తూ ప్రశంసలు అందుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫార్మేట్ తో సంబంధం లేకుండా సూర్యకుమార్ యాదవ్ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ టీమిండియాలో కీలక ఆటగాడిగా మారిపోతున్నాడు. ఇకపోతే ఇటీవల సూర్యకుమార్ యాదవ్ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ ఆడుతుంది. అయితే ప్రస్తుతం మూడో టీ-20లో భాగంగా కష్టాల్లో కూరుకుపోయి ఓటమి వైపు వెళ్ళిపోతున్న టీమిండియాను ఆదుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. 76 పరుగులతో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. దీంతో ఐసిసి టీ20 ర్యాంకింగ్ లో దూసుకుపోయాడు సూర్యకుమార్ యాదవ్. ఐతే ఇక ఇప్పటి వరకూ వెస్టిండీస్తో జరిగిన మూడు మ్యాచ్ల లో కూడా 111 పరుగులు చేశాడు అని చెప్పాలి. అంతకుముందు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన టి20 సిరీస్ లో కూడా తన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.


 ఈ క్రమంలోనే ఇటీవల టి20 ర్యాంకింగ్స్ ను ఐసిసి ప్రకటించగా సూర్యకుమార్ యాదవ్ అద్భుతమే చేశాడు అని చెప్పాలి. ఏకంగా 44 స్థానాలు మెరుగుపరుచుకుని 5వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఇటీవల వెస్టిండీస్తో జరిగిన 3వ టి20 మ్యాచ్ లో తన బ్యాటింగ్తో ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ ఏకంగా రెండో ప్లేస్ కి చేరుకోవడం గమనార్హం. అయితే టాప్ ప్లేస్ లో ఉన్న బాబర్ కి సూర్యకుమార్ యాదవ్ కి పెద్దగా తేడా లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మరో మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ రాణించాడు అంటే టాప్ ప్లేస్ కి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. బాబర్ అజాం, సూర్యకుమార్ మధ్య కేవలం రెండు పాయింట్లు మాత్రమే తేడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: