ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత అటు విశ్వ వేదిక కామన్వెల్త్ క్రీడలలో మహిళల క్రికెట్ కు అవకాశం దక్కింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలు జట్లు ఇక కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా టి20 సిరీస్ ఆడుతున్నాయి. ఇక ఈ టోర్నీలో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. కాగా కామన్ వెల్త్ క్రీడల్లో భాగంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది భారత మహిళల జట్టు. ఈసారి విజయం సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్లో చేదు అనుభవం ఎదురైంది. అయినప్పటికీ ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుంది.


 మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి నిరాశపరిచింది భారత మహిళల జట్టు. ఇక రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్తో తలపడింది అన్న విషయం తెలిసిందే. ఇక రెండో మ్యాచ్లో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించి విజయఢంకా మోగించింది. ఇలాంటి సమయంలోనే మూడో మ్యాచ్లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సెమిస్ చేరాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిందే. ఇక ఇలాంటి మ్యాచ్లో అటు భారత మహిళ జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది అని చెప్పాలి. బార్బడోస్ జట్టుతో జరిగిన మూడో మ్యాచ్లో విజయం సాధించి ఇక గ్రూప్ ఏ నుంచి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది భారత మహిళల జట్టు. బార్బడోస్ జట్టు మీద ఏకంగా 100 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకోవడం గమనార్హం.  బార్బడోస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 62 పరుగులు మాత్రమే చేసింది.  ఈ మ్యాచ్లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 163 పరుగులు చేయగా ఇక బార్బడోస్ మాత్రం 62 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి: