సరిగ్గా ఐపీఎల్ ముందు వరకు కెరియర్లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య. ఒకప్పుడు భారీగా పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర వహించిన హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత గుజరాత్  కెప్టెన్గా ఆల్రౌండ్ ప్రదర్శన చేసి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే మొదటి ప్రయత్నంలోనే గుజరాత్ జట్టుకు ఏకంగా టైటిల్ కూడా అందించాడు హార్దిక్ పాండ్యా. ఇక ఇంత అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత టీమిండియా సెలెక్టర్లు ఊరుకుంటారా అతనికి జట్టులో అవకాశం కల్పించారు.


 ఈక్రమంలోనే కెరీర్లోనే అత్యుత్తమ మైన ఫాంలో కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా టీమిండియా తరపున కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. ఒక వైపు బౌలింగ్లో మరోవైపు బ్యాటింగ్లో కూడా తనకు తిరుగు లేదు అని నిరూపిస్తున్నాడు అని చెప్పాలి. టీమిండియా విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు. ఇక వన్డే టి20 ఫార్మాట్లలో అవకాశం దక్కించుకున్నాడు. ఇటీవలే ప్రస్తుతం టీమిండియా లో ఉన్న పరిస్థితుల పై స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఉన్న ఆటగాళ్లకు ఒకప్పటి కంటే ఎక్కువ స్వేచ్ఛ భద్రత లభిస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు..


 రోహిత్ శర్మ నాయకత్వంలో తాను ఎప్పుడూ ఆడిన కూడా పూర్తి స్వేచ్ఛ.. కోరుకునే విధంగా ఆడే సౌలభ్యం లభించింది. ఈ విషయంలో రోహిత్ తో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్  ఘనత కూడా ఉంది.  ఆ ఇద్దరూ కలిసి జట్టులో సానుకూల వాతావరణంలో తీసుకువచ్చారు అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఇటీవలే మీడియాతో మాట్లాడిన హార్దిక్ పాండ్యా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక ప్రస్తుతం జట్టులోకి వస్తున్న యువ ఆటగాళ్లు కూడా ఎక్కడా ఒత్తిడికి గురి కాకుండా కోచ్ రాహుల్ ద్రవిడ్ కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి మద్దతు అందిస్తూ అండగా నిలబడుతున్నారు అని చెప్పుకొచ్చాడు.


 ఇక హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్గా మారిపోయాయ్. అయితే మొన్నటికి మొన్న సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్ కూడా జట్టులో పరిస్థితులు బాగున్నాయని కొన్నిసార్లు సరైన ప్రదర్శన చేయక పోయినప్పటికీ ఎవరూ కూడా నొచ్చుకునేలా మాట్లాడటం లేదు అంటూ వ్యాఖ్యానించాడు. ఇకపోతే ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్ లో జరిగిన మూడు మ్యాచ్లలో రెండు విజయాలు సాధించి 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది టీమిండియా. శనివారం వెస్టిండీస్తో నాలుగవ టి 20 మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: