ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది ఇక విండీస్ గడ్డపై ఆదిత్య వెస్టిండీస్ జట్టును వన్డే సిరీస్ లో క్లీన్స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో టి20 సిరీస్ ఆడుతోంది. ఈ టి 20 సిరీస్ లో భాగంగా మూడు మ్యాచ్లు జరిగాయి. రెండు మ్యాచ్లలో విజయం సాధించినా టీమిండియా ఆధిక్యంలో  కొనసాగుతోంది. టీమిండియా ఇలా కరేబియన్ గడ్డపై మునుపెన్నడూ లేనివిధంగా ఆధిపత్యాన్ని సాధిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే టీమిండియా ఇంత అద్భుతంగా రాణిస్తూ ఉన్నప్పటికీ అటు టీమ్ ఇండియా మ్యాచ్ లను మాత్రం పట్టించుకునే వారే లేకుండాపోయారు అనేది తెలుస్తుంది.



 అయితే ముందుగా వన్డే ఫార్మాట్ విషయంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీ వహిస్తూ ఉండటంతో ఇక వన్డే ఫార్మాట్ పై ఎవరికి ఆసక్తి లేకపోవడంతో ప్రేక్షకులు  అందరూ లైట్ తీసుకున్నారు అనుకున్నారు. కానీ రోహిత్ శర్మ సారథ్యంలో ప్రధాన జట్టు బరిలోకి దిగిన ప్రేక్షకుల ఆదరణ మాత్రం అంతంతమాత్రంగానే ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే టీమిండియా లో విరాట్ కోహ్లీ విలువ ఏంటి అన్నది మాత్రం ఇక కోహ్లీ లేని పర్యటనలో అర్థమైంది అన్నది తెలుస్తుంది. ఇటీవలే ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కోహ్లీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమే అనిపిస్తుంది.


 ఫామ్ లో లేకపోయినా బీసిసిఐ విరాట్ కోహ్లీని తప్పించ లేదని.. ఎందుకంటే అతను కేవలం భారత క్రికెట్ కు మాత్రమే కాదు అంతర్జాతీయ క్రికెట్ కు బ్రాండ్ అంబాసిడర్ అని.. కోహ్లీ పక్కన పెట్టడం వల్ల బిసిసిఐకి కోట్లలో నష్టం వస్తుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. నిజంగానే కోహ్లీ టీవీ మీద కనిపిస్తే కాసుల వర్షం కురుస్తూ ఉంటుంది. అన్ని దేశాల్లో కూడా విరాట్ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. ఇప్పటివరకు మిగతా క్రికెట్ బోర్డులు కూడా కోహ్లీ పేరు చెప్పి బాగానే సంపాదించాయ్ అని చెప్పాలి. అయితే ఇటీవలే ఇంగ్లాండ్ గడ్డపైన విఫలమైన కోహ్లీ కాస్త బ్రేక్ తీసుకున్నాడు. దీంతో విండీస్ పర్యటనలో కోహ్లీ లేకుండానే భారత జట్టు ఆడుతోంది. కోహ్లీ లేకుండా టీమిండియా ఆడుతున్న మ్యాచ్ లకు వ్యూవర్ షిప్ కరువైంది  అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: