మొన్నటి వరకు టీమ్ ఇండియా లో మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ ఎవరూ ఊహించని విధంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశాడు అన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం తన కెప్టెన్సీకి గుడ్ బాయ్ చెప్పేసాడు. అయితే అంతకు ముందే టీ20 ప్రపంచ కప్ అనంతరం పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతలను వదులుకున్నాడు. ఇక ఆతర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి బిసిసీఐ అతని తప్పించింది. అప్పట్లో ఈ వ్యవహారం అంతా సంచలనంగా  మారిపోయింది అని చెప్పాలి.


 కోహ్లీ ని సంప్రదించి కెప్టెన్సీ నుంచి తప్పించాము అంటూ బిసిసిఐ చెబితే.. అలాంటిది జరగలేదని మీడియాతో కుండబద్దలు కొట్టాడు విరాట్ కోహ్లీ. తనను ఎవరూ సంప్రదించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా జరిగిన ఏడు నెలల తర్వాత ఇటీవలే ఈ వ్యవహారంపై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ దూమల్ తొలిసారి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అనేది విరాట్ కోహ్లీ సొంత నిర్ణయం అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లిని తప్పించాలని బిసిసిఐ ప్రయత్నాలు చేసింది అన్న వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చాడు.


 విరాట్ కోహ్లీ అందరిలా ఒక సాదాసీదా ఆటగాడు కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. అతను భారత క్రికెట్కు ఎంతో చేసాడు. అతను అద్భుతమైన ఆటగాడు.. కోహ్లిని తప్పించాలని బోర్డు ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అలాంటి వార్తలతో బిసిసిఐకి జరిగే నష్టం కూడా ఏమీ లేదు.  ఇక త్వరలో కోహ్లీ ఫాం అందుకోవాలని కోరుకుంటున్నా. టీమ్ సెలక్షన్ అనేది కేవలం సెలక్టర్ల పని మాత్రమే. అందులో బోర్డు జోక్యం చేసుకోదు అంటూ చెప్పుకొచ్చాడు  అరుణ్ దూమల్. బోర్డు లో ప్రతి ఒక్కరికి విరాట్ కోహ్లీ అంటే ప్రత్యేక గౌరవం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: