మెగా పోరుకి అంతా సిద్ధం అవుతుంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్లో ప్రపంచకప్ ప్రారంభం అవుతుంది అనే విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత జట్టు ఎన్నో అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో బాగా రాణించిన యువ ఆటగాళ్లు అందరికీ కూడా జట్టులో స్థానం కల్పించింది అనే చెప్పాలి. అంతేకాదు ఇటీవల కాలంలో టీమిండియా ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా టీమిండియా లోకి వచ్చిన ఎంతో మంది యువ ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు.


 మరి కొంతమంది ఆటగాళ్లు కేవలం రెండు లేదా మూడు మ్యాచ్ల కే పరిమితం అవుతున్నారు అన్న విషయం తెలిసిందే. టి20 వరల్డ్ కప్ కి ముందే ఆసియాకప్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆసియా కప్ లో కూడా విజయ ఢంకా  మోగించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే గత కొంత కాలం నుంచి ఓ ముగ్గురు ఆటగాళ్ల ఫామ్ చూస్తూ ఉంటే వారి స్థానం జట్టులో దండగ అన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటివారిలో శ్రేయస్ అయ్యర్ ముందు వరుసలో ఉన్నాడు అని చెప్పాడు.


 యువ ఆటగాళ్లు అందరికంటే ముందుగానే శ్రేయస్ అయ్యర్ మంచి క్రికెటర్గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అతనే టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ అని అందరూ భావించారు. భవిష్యత్తు కెప్టెన్ కూడా అతనే అనుకున్నారు. కానీ నిలకడలేమితో ఇబ్బంది పెడుతున్నాడు. వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లోనూ రాణించిన శ్రేయస్ అయ్యర్ టి20 సిరీస్ లో మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. దీంతో అతను ప్రపంచకప్కు ఎంపికవడం కష్టంగానే కనిపిస్తోంది. ఐపీఎల్ ప్రదర్శన ద్వారా టీమిండియాలో అవకాశం దక్కించుకున్న ఆవేశ్ ఖాన్ కూడా దారుణమైన ప్రదర్శనా చేస్తున్నాడు. దీంతో అతనికి కూడా టి20 వరల్డ్ కప్ లో స్థానం డౌట్ గానే కనిపిస్తుంది. మరో యువ బౌలర్ ప్రసీద్ కృష్ణ కూడా చెత్త ప్రదర్శనతో నిరాశ పరుస్తున్నాడు. ఈ ముగ్గురు కూడా 20 ప్రపంచకప్లో దండగ అన్న వాదన నెటిజన్ల  నుంచి వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: