సాధారణంగా ప్రేక్షకులందరికీ ఎంతో ఇష్టమైన టీ20 ఫార్మాట్ లో అటు బ్యాట్స్మెన్ లదే హవా  కొనసాగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే క్రీజులోకి వచ్చిన బ్యాట్స్మెన్ కు ఎక్కువ సమయం ఉండదు. క్రీజులో నిలబడిన కొంత సమయంలోనే విధ్వంసం సృష్టించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక క్రీజు లోకి రావడం రావడమే  సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతు ఉంటారు ప్రతి ఒక్కరు. ఇక టీ20 ఫార్మాట్లో బ్యాట్స్మెన్లు ఇలాంటి విధ్వంసం సృష్టిస్తారు కాబట్టి ప్రేక్షకులూ ఈ ఫార్మాట్ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే బ్యాట్స్మెన్లు టీ-20 ఫార్మెట్లో భారీగా పరుగులు చేస్తూ ఎప్పుడూ రికార్డులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే టీ-20 ఫార్మెట్లో ప్రపంచ క్రికెట్లో ఎక్కువ ఫోర్లు కొట్టిన ఆటగాళ్ళు ఎవరు ఇక ఎక్కువగా సిక్సర్లతో విజృంభించిన బ్యాట్స్మెన్లూ ఎవరు అన్నది కూడా అప్పుడప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు కూడా ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.  అంతర్జాతీయ టీ20 లో ఎక్కువ ఫోర్లు కొట్టిన ఆటగాళ్లు ఎవరు అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. పాల్ స్టెర్లింగ్  334 ఫోర్లతో ప్రస్తుతం టీ-20 ఫార్మెట్లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు అని చెప్పాలి.


 ఇక ఆ తర్వాత స్థానంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 311 ఫోర్లతో అత్యధిక పోర్లు కొట్టిన జాబితాలో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాత స్థానంలో 301 ఫోర్లతో మార్టిన్ గప్టిల్ కొన సాగుతూ ఉండగా.. ఆ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ 299 ఫోర్లతో నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఆ తర్వాత స్థానంలో ఆరోన్ ఫించ్ రెండు వందల ఎనభై ఆరు ఫోర్లతో ఐదవ స్థానంలో కొనసాగుతుండటం గమనార్హం. ఈ లిస్టులో ఉన్న ప్రతి బ్యాట్స్మెన్ కూడా ప్రస్తుతం మంచి ఫామ్లో కొనసాగుతూ తమ బ్యాటింగ్ ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: