వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా ఐదు మ్యాచ్ల టి-20 సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో భాగంగా ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ముగిసాయి. ఈ నాలుగు మ్యాచ్ లలో టీమిండియా మూడింటిలో విజయం సాధిస్తే వెస్టిండీస్ ఒక మ్యాచ్లో విజయం సాధించింది. అయితే వెస్టిండీస్ కి ఒక మ్యాచ్లో విజయం సాధించడానికి వెనుక కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది వెస్టిండీస్ స్టార్ బౌలర్ ఓబెడ్ మెకాయ్  మాత్రమే అని చెప్పాలి. రెండో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే భారత్ సమయంలో తన బౌలింగ్తో రెచ్చిపోయిన ఓబెడ్ మెకాయ్ ఏకంగా ఆరు వికెట్ల తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే టీమిండియా పతనాన్ని శాసించాడు అని చెప్పాలి. ఇక రెండవ టీ20 మ్యాచ్ లో ఇతని బౌలింగ్లోనే రోహిత్ శర్మ గోల్డెన్ కూడా వెనుదిరిగాడు.  ఇలా ఒక రకంగా భారత బ్యాటింగ్ విభాగాన్ని మొత్తం తన బౌలింగ్ తో  భయపెట్టాడు అని చెప్పాలి. రెండో టీ20 మ్యాచ్లో భారత బ్యాటింగ్ విభాగాన్ని భయపెట్టిన ఓబెడ్ మెకాయ్ ఇప్పుడు నాలుగో టి20 మ్యాచ్ లో మాత్రం టీమిండియా దాటికి ఒక్కసారిగా భయం తో ఊగిపోయాడు. ముఖ్యంగా భారత ఓపెనర్లు రోహిత్ శర్మ సూర్యకుమార్ ఓబెడ్ మెకాయ్ వేసిన ఒకే ఓవర్లో 25 పరుగులు పిండుకున్నారు. దీంతో అతను అయోమయంలో పడిపోయాడు. ఇక మూడో ఓవర్ వేయాగ.. తొలిబంతి అని రోహిత్ శర్మ సిక్సర్ కొట్టాడు. తర్వాత చివరి బంతిని సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ గా మలిచాడు.


 మొత్తంగా అతని బౌలింగ్ లో ఒకే ఓవర్ లో 25 పరుగులు రాబట్టారు భారత బ్యాట్స్మెన్లు. ఇక భారత బ్యాట్స్మెన్ దెబ్బకు ఒక్కసారిగా ఓబెడ్ మెకాయ్ ముఖం మాడిపోయింది. అయితే కేవలం ఒకే  ఓవర్ లో కాదు మ్యాచ్ మొత్తంలో నాలుగు ఓవర్లు వేసిన ఓబెడ్ మెకాయ్ భారత బ్యాట్స్మెన్ల దెబ్బకు 66 పరుగులు సమర్పించుకున్నాడు. అదే సమయంలో రెండు వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. అయితే  ఓబెడ్ మెకాయ్ బౌలింగులో భారత బ్యాట్స్మెన్లు సిక్సర్లు ఫోర్లు తో  చెలరేగిపోయిన నేపథ్యంలో మొన్న భయపెట్టిన ఓబెడ్ మెకాయ్ ఇవాళ భయపడ్డాడు అంటూ క్రికెట్ అభిమానులు అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: