దినేష్ కార్తీక్.. ఇటీవలే భారత క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. వినిపించడం కాదు ఏకంగా మార్మోగిపోతోంది అని చెప్పాలి. 37 ఏళ్ల వయసులో అతని కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు దినేష్ కార్తిక్. ఈ క్రమంలోనే అద్భుతంగా రాణిస్తూ తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. ఎన్నో రోజుల నుంచి టీమిండియాను వేధిస్తున్న ఫినిషర్ పాత్రను తీసుకొని తన బ్యాటింగ్తో మెరుపులు మెరిపిస్తూ ఉన్నాడు.  కీలకమైన సమయంలో బ్యాటింగ్ కి వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే టీమిండియా ఆడబోయే ప్రతి టి20 మ్యాచ్ లో కూడా దినేష్ కార్తీక్ భాగం అవుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే 37 ఏళ్ల వయసులో కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో ఒకవైపు యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఉన్న తరుణంలో జట్టులోకి రావడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు అని చెప్పాలి. అయితే ఇటీవలే అద్భుతంగా రాణించిన దినేష్ కార్తీక్ ఆసియా కప్ జట్టు లో కూడా అవకాశం దక్కించుకున్నాడు అనే విషయం తెలిసిందే. దీంతో దినేష్ కార్తీక్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.


 కానీ కొంతమంది మాత్రం అనవసరంగా దినేష్ కార్తీక్ ను సంబంధంలేని వివాదంలోకి లాగుతు ఉండడం సంచలనంగా మారిపోయింది. సంజూ శాంసన్ ఆసియా కప్ ఆడబోయే జట్టులో ఎంపిక కాలేదు. అయితే దినేష్ కార్తీక్ ను జట్టులోకి ఎంపిక చేసి   సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంలో ఆంతర్యమేమిటి అంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై కొంతమంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సంజు శాంసన్ కు అన్యాయం జరిగింది అని చెప్పడం బాగానే ఉంది కానీ దినేష్ కార్తీక్ ని మధ్యలో ఎందుకు తీసుకు రావడం అన్నది మాత్రం సందేహాలకు తావిస్తోంది.  ఈ క్రమంలోనే దీనిపై స్పందిస్తూ నెటిజన్లు అత్త తిట్టినందుకు కాదు బాధ.. తోటి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా సెటైరిక్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dk