భారత మహిళల క్రికెట్ లో స్మృతి మందనకి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక భారత మహిళల జట్టు తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతూ ఎప్పుడూ అద్భుతంగా రాణిస్తూ ఉంటుంది. ఎంతో అలవోకగా భారీ షాట్లు ఆడటంలో స్మృతి మందాన పర్ఫెక్ట్ బ్యాటర్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కేవలం క్రికెట్ ఆట తో మాత్రమే కాదు తన అభినయంతో తన చిరునవ్వుతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ క్రికెటర్. ఎంతోమంది కుర్రకారు మనసులు కొల్లగొట్టింది అని చెప్పాలి.. 

 కానీ ఇటీవలే కొన్ని మ్యాచ్ లలో మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్ లో టీం ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన కి ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. టి20 ర్యాంకింగ్స్ లో భాగంగా స్మృతి మందాన ర్యాంక్ ఒక్కసారిగా పడిపోయింది. మొన్నటి వరకూ ఇక అంతర్జాతీయ టీ20 లలో రెండవ స్థానాన్ని  సొంతం చేసుకుంది. ఇక కొన్ని రోజుల నుంచి అదే ర్యాంకులో కొనసాగుతుంది స్మృతి మందాన. కానీ ఇప్పుడు మాత్రం స్మృతి మందాన ర్యాంక్ రెండు స్థానాలు పడిపోయి నాలుగో ర్యాంకు చేరుకుంది అనే చెప్పాలి.


 అదే సమయంలో షెఫాలీ వర్మ ఆరో స్థానానికి పడిపోయింది. ఇక జెమియా 7 స్థానాలు ఎగబాకి తొమ్మిది నెలల తర్వాత మళ్లీ 10వ స్థానాన్ని  పదిలం చేసుకుంది. ఇలా టి20 ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ కొనసాగుతూ ఉండడం గమనార్హం.. ఇక రెండు మూడు స్థానాల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ లానింగ్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫియా డివైన్ కొనసాగుతున్నారు. అయితే స్మృతి మందాన ర్యాంకింగ్ ఒక్కసారిగా పడిపోవడంతో అభిమానులకు షాక్ అవుతున్నారు అని చెప్పాలి. కాగా మంచి ఫామ్ లో కొనసాగుతున్న స్మృతి మందాన రానున్న రోజుల్లో మళ్లీ ఇక ర్యాంకింగ్స్ లో పైకి ఎగబాకే అవకాశం లేకపోలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: