భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఏ కెప్టెన్కు సాధ్యం కాని రీతిలో రెండుసార్లు వరల్డ్ కప్ అందించడమే కాకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విజేతగా కూడా టీమిండియాను నిలిపాడు మహేంద్రసింగ్ ధోని. ఇలా టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విషయాలు అందించడమే కాకుండా తన ఆటతీరుతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో బెస్ట్ ఫినిషర్  గా పేరుతెచ్చుకున్నాడు మహేంద్రసింగ్ ధోని.


 అయితే ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అతని క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికికూడా జట్టు లో కొనసాగుతున్న క్రికెటర్ల కంటే ఎక్కువ బ్రాండ్ ప్రమోషన్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు మహేంద్రసింగ్ ధోని. అయితే సాధారణంగా మహేంద్రసింగ్ ధోని సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్ గా ఉండడు అన్న విషయం తెలిసిందే. కానీ ధోని ఏదైనా పోస్టు పెట్టాడు అంటే అది క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అంతే కాదు ధోనికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది.


 ఇప్పుడు ఇలాంటి వార్త ఒకటి తెగ చక్కెర్లు కొడుతుంది అనే చెప్పాలి. మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ తో కనిపిస్తూ ఉన్న ఒక ఫోటో అభిమానులందరినీ కూడా సర్ప్రైస్ చేస్తుంది. ఇక ఈ ఫోటో లో భాగంగా ఏకంగా ఒక పండితుడి వేషధారణలో కనిపిస్తున్నాడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఈ ఫోటోలో పసుపు రంగు కుర్తా ధరించి కనిపిస్తున్నాడు. అయితే ఇది చూసి ఫాన్స్ అందరు కూడా సర్ప్రైస్ అవుతున్నారు. అయితే ధోనీని వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన ప్రమోషన్లోని ఫోటో అయి ఉండవచ్చు అని అభిమానులు భావిస్తున్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్రసింగ్ ధోని సూపర్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: