మరికొన్ని రోజుల్లో మినీ ప్రపంచ కప్ గా పిలవబడే ఆసియా కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాయాది దేశాలైన పాకిస్థాన్,ఇండియా ఆసియా కప్ లో తలపడేందుకు సిద్ధమవుతోంది.. ఇక మొదటి మ్యాచ్లోనే ఈ ఉత్కంఠ భరితమైన పోరు జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ పోరు గురించి ప్రపంచ క్రికెట్లో ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ భారత్ జట్లు ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తె బాగుంటుంది అనే విషయంపై ఇప్పటికే ఎంతో మంది క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.


 ఇక ఇటీవల కాలంలో క్రికెట్ విశ్లేషకుడు గా ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయిన పాకిస్థాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ఇటీవల తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్లో టీమ్ ఇండియా ఓపెనర్  గా కె.ఎల్.రాహుల్ ను ఆడించ వద్దు అంటూ సూచించాడు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో భాగంగా అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ ను మరోసారి ఓపెనర్గా ఆడించడం బెటర్ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కు జోడిగా సూర్య మొదలు పెడితే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 అతను ఇప్పటికే ఎన్నోసార్లు మిడిలార్డర్లో రాణించాడు. అందుకే ఇప్పుడు ఓపెనర్గా అతన్ని బరిలోకి దింపితే బాగుంటుంది. రాహుల్, రోహిత్ లను ఓపెనర్లుగా పంపితే  టీమిండియాకు భారీ నష్టం తప్పదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఘోర వైఫల్యానికి కారణం వీరి ఓపెనింగ్ జోడి అని మర్చిపోవద్దు అంటూ వ్యాఖ్యానించాడు. వీరిద్దరూ బ్యాటింగ్ శైలి ఒకేలా ఉంటుందని అటాకింగ్ కాకుండా నెమ్మదిగా ఆడుతారు అంటూ వారి గణాంకాలు చెబుతున్నాయి అంటూ డానిష్ కనేరియా వ్యాఖ్యానించాడు. అందుకే సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్గా బెస్ట్ అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: