ఎన్నో రోజుల నుంచి టీమిండియాకు దూరమైన శిఖర్ ధావన్ ఇటీవల వరుసగా జట్టులో స్థానం సంపాదించుకుంటూన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే జట్టులో స్థానం సంపాదించడమే కాదు అటు భారత జట్టుకు వన్డే లో సీనియర్లు విశ్రాంతి తీసుకునే సమయంలో కెప్టెన్సీ కూడా వహిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్కు కెప్టెన్గా వ్యవహరించిన ధావన్ భారత జట్టుకు అనూహ్యమైన విజయాన్ని అందించాడు. 3-0 తేడాతో భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు.


 ఈ క్రమంలోనే జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టుకు కూడా సారధ్య బాధ్యతలను దక్కించుకున్నాడు శిఖర్ ధావన్. ఇక అక్కడ కూడా శిఖర్ధావన్ అదరగొట్టపోతున్నాడని అభిమానులు భావించారు. ఇలాంటి సమయంలో అతనికి ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి. ముందుగా ఇక ధావన్ ను కెప్టెన్గా నియమిస్తూ జట్టును ప్రకటించిన బీసీసీఐ ఇటీవలే తమ నిర్ణయాన్ని మార్చుకుంది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే ఇలా సడన్ గా శిఖర్ ధావన్ కెప్టెన్సీ నుంచి తప్పించడం మాత్రం ఒక సీనియర్ ప్లేయర్ ను అవమానించడమే అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..


 రాహుల్ జట్టులోకి రావడం మంచిదే కానీ అతను ఫామ్ లో ఉన్నాడో లేడో అని  కూడా తెలియకుండా అతనికి సారథ్య బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐ ని ప్రశ్నిస్తూ ఉన్నారు ఎంతోమంది నెటిజన్లు. రాహుల్ ను ప్రాక్టీస్ కోసం మాత్రమే జట్టులోకి తీసుకున్నట్లయితే పర్వాలేదు కానీ కెప్టెన్సి ఇవ్వటం అంటే ధావన్ ను అవనించటం లాంటిది అంటూ చెబుతున్నారు.

 కాగా జట్టు వివరాలు ఇలా ఉన్నాయి.. కెఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, శుబ్‌మన్‌ గిల్, దీపక్‌ హుడా, రాహుల్‌ త్రిపాఠి, ఇషాన్‌ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్‌ సుందర్, శార్దుల్‌ ఠాకూర్, కుల్దీప్‌ యాదవ్, అక్షర్‌ పటేల్, అవేశ్‌ ఖాన్, ప్రసిధ్‌ కృష్ణ, దీపక్‌ చహర్, మహమ్మద్‌ సిరాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: