భారత క్రికెట్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు అత్యున్నతమైన క్రికెటర్ లుగా కొనసాగుతున్నారు.  జట్టులో సీనియర్లు కూడా వీరే కావడం గమనార్హం. అయితే మొన్నటి వరకు విరాట్ కోహ్లి జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తె ఇప్పుడు మూడు ఫార్మాట్లకు కూడా రోహిత్ శర్మ రెగ్యులర్ కెప్టెన్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇద్దరు క్రికెటర్లు అటు రికార్డుల్లో కూడా ఎవరికి వారే సాటి అని చెప్పాలి. కానీ కొన్ని రికార్డుల విషయంలో మాత్రం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మను ఇప్పటికీ చేరుకోలేదు అని తెలుస్తుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..


 వన్డే ఫార్మాట్ అంతర్జాతీయస్థాయిలో రోహిత్ ఇప్పటివరకు మూడు ద్విశతకాలు సాధించాడు. 2013లో ఆస్ట్రేలియా పై ద్విశతకం సాధించడం ద్వారా తన పరంపర కొనసాగించాడు. 2007లో శ్రీలంకపై 2012లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై  ద్విశతకాలు సాధించాడు. అయితే ఇంతవరకు కూడా విరాట్ కోహ్లీ వన్డేల్లో డబుల్ సెంచరీ అందుకోలేకపోయాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఏకంగా తన జట్టు ముంబై ఇండియన్స్ కి ఐదుసార్లు టైటిల్ అందించాడు. ఈ క్రమంలోనే అత్యధిక టైటిల్స్ అందించిన సారథిగా తన పేరును చిరస్మరణీయం చేసుకున్నాడు.


 కానీ విరాట్ కోహ్లీ మాత్రం బెంగళూరు జట్టుకు ఒక్కసారి కూడా టైటిల్ అందించలేకపోయాడు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపిఎల్ సీజన్ తో కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక అంతర్జాతీయ వన్డేలో రోహిత్ శర్మ ఇప్పటివరకు 250కి పైగా సిక్సర్లు బాదాడు. అయితే విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ లో 43 సెంచరీలతో సత్తాచాటినప్పటికీ సిక్సర్ల విషయంలో మాత్రం వెనకబడ్డాడు. ఇప్పటివరకు  125 సిక్సర్లు  మాత్రమే బాదాడు. ఇలా విరాట్ కోహ్లీ రికార్డుల రారాజు అయినప్పటికీ తన సహచరుడు అయినా రోహిత్ శర్మ సాధించిన రికార్డులకు మాత్రం ఇప్పటికీ చేరువ కాలేకపోయాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: