సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ సెలబ్రిటీలకు అయితే కేవలం వారి ప్రాంతం మేరకు మాత్రమే క్రేజ్ ఉంటుంది. కానీ అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేసి సార్లుగా ఎదిగిన క్రికెటర్లకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు ఉంటుంది. ఈ క్రమంలోనే క్రికెటర్లు ఏ చిన్న పోస్టులు పెట్టిన కూడా అది క్షణాల వ్యవధిలో వైరల్ గా మారిపోతుంది. ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక క్రికెటర్లు ధరించే బ్రాండెడ్ దుస్తులు వాచీలు బైకులు కార్లకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా శ్రద్ధ చూపుతూ ఉంటారు ఎంతో మంది. అయితే ప్రస్తుతం టీమిండియా వరుస పర్యటన లతో బిజీగా ఉన్న సమయంలో సూర్యకుమార్ యాదవ్  టీమిండియా లో స్థానం దక్కించుకుంటూ అంతే బిజీగా గడుపుతున్నాడు. మొన్నటి వరకు ఓపెనర్గా అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్ కు ఇటీవల ఓపెనర్ గా ప్రమోషన్ వచ్చింది అన్న విషయం తెలిసిందే  అయితే ఓపెనర్గా మొదట్లో విఫలమైనప్పటికీ ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుని అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి.


 ప్రస్తుతం కెరీర్లోనే అత్యుత్తమ దశ లో కొనసాగుతున్న టీమిండియా బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ ఆటలో మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా భార్య దేవిషా  తో టూర్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇటీవల ఖరీదైన కారును కొనుగోలు చేశాడు. 2.5 కోట్ల రూపాయలు వెచ్చించి మెర్సిడెజ్ బెంజ్ స్పోర్ట్స్ యుటిలిటీ కార్ కొనుగోలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: