సాధారణంగా క్రికెట్ ఆటగాళ్లు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు పెట్టిన నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా కూడా  ఆటగాళ్ల పై క్రికెట్ బోర్డులు కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. నిషేధం విధించడానికి కూడా వెనకడుగు వేయరు అనే చెప్పాలి. ఇంగ్లాండ్ క్రికెటర్ విషయంలో కూడా ఇదే జరిగింది అనేది తెలుస్తుంది. ఇంగ్లాండ్ క్రికెటర్ ఆడమ్ లిత్ కు ఈసిబి ఊహించని షాక్ ఇచ్చింది.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పరిధిలో జరగబోయే మ్యాచ్ లలో కూడా అతను ఆడడానికి వీలు లేకుండా నిషేధం విధించడం గమనార్హం.


 ఇది కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే అతని బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉండటం కారణంగానే ఇక ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇలాంటి నిర్ణయం తీసుకుంటూ నిషేధం ప్రకటించింది అన్నది తెలుస్తుంది. జూలై 16 వ తేదీన విటాలిటీ బ్లాస్ట్ లో భాగంగా లంక షైర్ జట్టుతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆడమ్ లిత్ ఒకే ఓవర్ బౌలింగ్ చేసి 15 పరుగులు ఇచ్చాడు. అయితే ఆ మ్యాచ్ కి ఆన్ ఫీల్డ్ అంపైర్ గా ఉన్న డేవిడ్ మిల్స్న్, నీల్ మ్యాలెండర్లు ఆడమ్ లిత్ బౌలింగ్  యాక్షన్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు.


 ఆడమ్ లిత్ తన బౌలింగ్ యాక్షన్ లో చేయి 15 డిగ్రీల త్రేషోల్డ్ మార్కను అధిగమించి నట్లు అంపైర్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈసీబీ అధికారులు దీనిపై దర్యాప్తు చేపట్టారు. ఇక బౌలింగ్ యాక్షన్ నిజంగానే తేడాగా అనిపించడంతో చివరికి రెగ్యులేషన్ టీం కి పంపించారు. ఈ క్రమంలోనే మరోసారి బౌలింగ్ అసెస్మెంట్ నిర్వహించే వరకు ఆడమ్ లిత్ బౌలింగ్ పై  నిషేధం కొనసాగనుంది. దీంతో ప్రస్తుతం హండ్రెడ్ టోర్నమెంట్ లో ఆడుతున్న ఆడమ్ లిత్ బౌలింగ్ వేయకూడదని ఉత్తర్వులు కూడా వచ్చాయని చెప్పాలి.. కాగా హండ్రెడ్ టోర్నమెంట్లో నార్తన్ సూపర్ చార్జెర్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ ఆటగాడు. ఈ నిషేధం నేపథ్యంలో అభిమానులు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ecb