ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన చేసి టీమిండియాలో అవకాశం దక్కించుకుని.. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న క్రికెటర్లలో మయాంక్ అగర్వాల్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే తన ఇన్నింగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. కానీ ఆ తర్వాత కాలంలో అదే ఫామ్ను కొనసాగించలేక చివరికి జట్టుకు దూరం అయ్యాడు అని చెప్పాలి. ఎన్నో రోజుల నుంచి పేలవమైన ఫాం తో ఇబ్బంది పడుతున్న మయాంక్ అగర్వాల్ ఇక ఎన్నో రోజుల తర్వాత శతకంతో చెలరేగిపోయాడు.


 49 బంతుల్లోనే 10 ఫోర్లు 6 సిక్సర్లతో 102 పరుగులు చేసి జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు అని చెప్పాలి. అయితే ఇది టీమ్ ఇండియా తరఫున కాదు మహారాజా ట్రోఫీ కెఎస్సిఎ టి20 ఛాలెంజ్లో భాగంగా. ఇటీవలే ఈ టోర్నీలో భాగంగా శివమొగ్గ స్ట్రైకర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శివమొగ్గ స్ట్రైకర్స్ 19 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు బ్లాస్టర్స్ 15.4 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది అని చెప్పాలి. లక్ష్య సాధనలో భాగంగా బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మయాంక్ అగర్వాల్ సెంచరీతో చెలరేగి పోయాడు.


 అయితే అతను సెంచరీతో చెలరేగి పోయినప్పటికీ జట్టులో స్థానం మాత్రం కష్టమే అని తెలుస్తోంది. టీమిండియాలో చోటు కోల్పోయిన మయాంక్ అగర్వాల్ ఇప్పుడు జట్టులోకి వచ్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కెప్టెన్ గా వ్యవహరించిన మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్లో కెప్టెన్సీలో కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఇటీవలి కాలంలో రోజుకో కొత్త క్రికెటర్ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో జట్టుకు దూరమైన ఎన్నో రోజులు గడిచిపోతున్న మయాంక్ అగర్వాల్ ని జట్టులోకి తీసుకోవడం మాత్రం కష్టమేనని తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: