ఇటీవల కాలంలో క్రికెట్ అనేది ఒక ఖరీదైన ఆట గా మారిపోయింది. ఎంతో మంది క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు అంటే చాలు ఇక కోట్ల రూపాయలు సంపాదించడం లగ్జరీ లైఫ్ గడపడం లాంటివి చేస్తూ ఉంటారు అని ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. కానీ నాణానికి  ఒక వైపు మాత్రమే. మరో వైపు చూస్తూ ఉంటే ఎన్నో కష్టాల మధ్య క్రికెట్ ఆడుతున్న పేద దేశాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి వారిలో ఎక్కువగా వినిపించే పేరు జింబాబ్వే. ఒకప్పుడు క్రికెట్లో బలమైన జట్టుగా కొనసాగిన జింబాబ్వే అనంతరం వివాదాలతో చెడ్డ పేరు తెచ్చుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో పసికూన జట్టు గా మారిపోయింది.

 అయితే జింబాబ్వే పేద దేశం కావడంతో అక్కడ క్రికెట్ పరిస్థితి అధ్వానంగా ఉంటుంది అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు అయితే దేశం కోసం క్రికెట్ ఆడే ఆటగాళ్ల జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఆ దేశ క్రికెట్ బోర్డు ఉంటుంది అని చెప్పాలి. అయితే తమ దేశంలోకి వచ్చే విదేశీ జట్లు ఏసీ బస్సుల్లో వస్తూ ఉంటే ఇక జింబాబ్వే క్రికెటర్ లు మాత్రం ఆటో రిక్షా లో రావాల్సిన పరిస్థితి. ఇప్పుడు పరిస్థితిలో కొంత మార్పు వచ్చినట్లు తెలుస్తోంది.  జింబాబ్వే జట్టు ఆడుతున్న ఆటగాళ్ల మ్యాచ్  ఫీజు గురించి తెలిస్తే మాత్రం అందరూ పాపం అనకుండా ఉండలేరు.


 జింబాబ్వే క్రికెట్ కాంటాక్ట్ జాబితాలో ఉన్న ఆటగాళ్లకు గరిష్టంగా 50 వేల యూఎస్ డాలర్లు అంటే దాదాపు 40 లక్షల రూపాయల వార్షిక వేతనం లభిస్తుంది. అయితే ప్రతి ఒక్కరికి ఇంత మొత్తం లభించదు కొందరు ఇంతకంటే తక్కువ కూడా తీసుకుంటారు. వార్షిక వేతనం తోపాటు టెస్ట్ వన్డే టి20 మాట్లాడుతూ ద్వారా మరికొంత సంపాదించేందుకు అవకాశం ఉంటుంది. టెస్ట్ ద్వారా గరిష్టంగా ఒక మ్యాచ్ కి 1.59 లక్షలు వన్డేలో ద్వారా ఒక మ్యాచ్ కి 79000, టి20 ద్వారా 39000  ఇస్తారట అక్కడి ఆటగాళ్లకు. భారత ఆటగాళ్లు మాత్రం ఒక్క టెస్ట్ మ్యాచ్ 15 లక్షలు వన్డే మ్యాచ్ కి ఆరు లక్షలు టి20 మ్యాచ్ కి మూడు లక్షలు పొందుతారు. కాంట్రాక్ట్ రూపంలో ఏటా కోట్ల రూపాయలు జీతంగా లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: