టీం ఇండియా ప్రస్తుతం వరుస పరాజయాలతో బిజీబిజీగా గడుపుతోంది అనే విషయం తెలిసిందే. ఒక దేశ పర్యటన ముగిసిన వెంటనే కాస్త గ్యాప్ తీసుకుని ఇక మరో దేశ పర్యటన కి వెళ్తు అక్కడ వరుసగా సిరీస్ లు ఆడుతుంది. విదేశీ పర్యటనలకు వెళ్లడమే కాదు అక్కడ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వన్డే టి20 ఫార్మాట్ అనే తేడా లేకుండా అద్భుతంగా రాణిస్తుంది. జట్టులో ఆటగాళ్ళను మారుస్తూ బీసీసీఐ వరుస ప్రయోగాలు చేస్తున్నప్పటికీ ఏది కూడా టీమిండియా విజయాన్ని ఆపలేక పోతుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ క్లీన్  స్వీప్ చేసిన టీమ్ ఇండియా ఇక టీ20 సిరీస్ లో భాగంగా 4-1 తేడాతో విజయం సాధించింది.. ఇప్పుడు  ఆరేళ్ల గ్యాప్ తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైంది  అనే విషయం తెలిసిందే.  జింబాబ్వే పర్యటనకు ద్వితీయ శ్రేణి జట్టును పంపించేందుకు బిసిసీఐ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా ఇప్పటికే ప్రకటించింది. పసికూన  జింబాబ్వేపై టీమిండియా ఒక గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. బంగ్లాదేశ్తో జరిగిన టీ20 వన్డే సిరీస్ను కైవసం చేసుకున్న జింబాబ్వే ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది..


 ఈ క్రమంలోనే జింబాబ్వే జట్టు లో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న ఇన్నోసెంట్ కియా ఏకంగా భారత సారథి కేఎల్ రాహుల్ కి వార్నింగ్ ఇచ్చాడు.. భారత జట్టుకు గట్టి పోటీ ఇవ్వడం కాదు ఖచ్చితంగా ఓడించి తీరుతామని అంటూ చెప్పుకొచ్చాడు. భారత్తో జరిగే సిరీస్లో టాప్ స్కోరర్గా నిలిచి భారత్ పతనాన్ని శాసిస్తా అంటూ చెప్పుకొచ్చాడు. జింబాబ్వే జట్టులో తన మాటే శాసనం అంటూ తెలిపాడు.  ఆసియ కప్ ప్రారంభానికి ముందు జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ ఆడపోతుంది భారత జట్టు.. ఈ క్రమంలోనే టీమిండియా తో జరిగే వన్డే సిరీస్లో జింబాబ్వే 2-1 గెలుస్తుందని ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్  చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: