ఆగస్టు 27వ తేదీ నుంచి మినీ వరల్డ్ కప్ గా పేరున్న ఆసియా కప్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అందరి దృష్టికి కూడా ఈ ఆసియాకప్ పైన ఉంది. ఇప్పటికే భారత జట్టు 15 మంది సభ్యులతో కూడిన సభ్యుల వివరాలను ప్రకటించింది. ఇక ఇందులో విరాట్ కోహ్లీ కూడా ఉండడం గమనార్హం. అయితే ఆసియా కప్లో భాగంగా విరాట్ కోహ్లీ ఎలా రాణించ పోతున్నాడు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడూ.


 బిసిసీఐ అతనికి అవకాశాలు ఇస్తున్నప్పటికి కూడా సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడూ అని చెప్పాలి. ఒకప్పుడు మంచినీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు చేసిన కోహ్లీ.ఇక ఇప్పుడు మాత్రం సాదాసీదా స్కోర్ చేయడానికి కూడా తెగ ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పాలి. అయితే మొన్నటి వరకు కొన్నాళ్ళ పాటు రెస్ట్ తీసుకున్న విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో ఫామ్లోకి రావాలని ఎంతోమంది కోరుకుంటున్నారు. ఇదే విషయంపై ఎంత మంది మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆసియా కప్ లో విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడంపై ఇటీవలే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ స్పందించారు.



 విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వస్తే  మాత్రం ఇబ్బందులు తప్పవు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ సామర్థ్యం ఏమిటో అందరికీ తెలుసు. భారత ఆటగాళ్లు ఇలాంటి ఫామ్లో ఉన్న సరే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉంటారు. ఒకవేళ పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ పుంజుకున్నాడు అంటే  అది పాకిస్థాన్ జట్టుకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. తుది జట్టులో ఆటగాళ్లు మాత్రమే కాకుండా టీమిండియా బెంచ్ కూడా ఎంతో పటిష్టంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు సల్మాన్ బట్. ఆసియా కప్ వేదికగా ఈనెల 28వ తేదీన పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: