ఒకప్పుడు దక్షిణాఫ్రికా జట్టు అంటే అంతర్జాతీయ క్రికెట్ లో ఎంతో గుర్తింపు ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అంటే చాలు ప్రత్యర్ధి జట్టు  వణికిపోయేది అని చెప్పాలి. అద్భుతమైన బౌలింగ్ విభాగం అదరగొట్టే బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపించేది దక్షిణాఫ్రికా జట్టు. కానీ గత కొంతకాలం నుంచి దక్షిణాఫ్రికాలో క్రికెట్ జట్టు ప్రాబల్యం కోల్పోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ప్రత్యర్థులకు సరైన పోటీ ఇవ్వలేకపోతోంది. అదే సమయంలో ఇక మిగతా దేశాల జట్లను అన్నీ కూడా వరుస పర్యటనలతో బిజీ బిజీగా గడుపుతున్న సమయంలో కూడా దక్షిణాఫ్రికా మాత్రం ఇలా వరుసగా మ్యాచ్లు ఆడే లేకపోతోంది.


 వెరసి అక్కడ ఆటగాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో చూస్తే దక్షిణాఫ్రికా ఏ ఫార్మాట్ లో కూడా ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోవడం అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పాలి. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఇలాంటి పరిస్థితి రావడంతో ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడిపోయారు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికా క్రికెట్ లో నెలకొన్న పరిస్థితులపై ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ షాకింగ్ ఆరోపణలు చేశారు.


 టెస్ట్ క్రికెట్ ఆడే విషయంలో తమకు తీరని అన్యాయం జరుగుతోంది అంటూ ఆరోపించాడు.  ఇండియా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లు వరుసగా టెస్టు సిరీస్ లు భాగంగా మ్యాచులు ఆడుతూ ఉంటే దక్షిణాఫ్రికా జట్టు మాత్రం కేవలం సింగిల్ క్రికెట్ మ్యాచ్ లకే  పరిమితం అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై క్రికెట్ బోర్డు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే అక్కడ మూడు మ్యాచ్ల సిరీస్ ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: