సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో కేవలం కొంత మంది ఆటగాళ్లకు మాత్రమే మిస్టర్ 360 అనే గుర్తింపు వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే . అయితే ఈ పేరు ఊరికే రాదు అటు మైదానం లో ఉన్న అన్ని వైపులా కూడా ఎంతో అలవోకగా షాట్లు ఆడిన బ్యాట్స్మెన్ ను మాత్రమే మిస్టర్ 360  అంటూ ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. అయితే ఇప్పటివరకు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎబి డివిలియర్స్ కు ఇలాంటి పేరు వచ్చింది అనే విషయం తెలిసిందే. మైదానం లో ఉన్న అన్ని వైపులా కూడా అద్భుతమైన షాట్లు ఆడటంలో  దిట్ట అని చెప్పాలి. అందుకే అతన్ని అభిమానులు అందరూ కూడా మిస్టర్ 360 అంటూ పిలుస్తూ ఉంటారు. అయితే భారత క్రికెట్ లో కూడా ఇటీవలే ఒక బ్యాట్స్మెన్  ఇదే రీతిలో పేరు సంపాదించుకున్నాడు.


 ఆ బాట్స్మన్ ఎవరో కాదు సూర్యకుమార్ యాదవ్.. ఎంతో అద్భుతమైన షాట్లు ఆడుతూ భారీ ఇన్నింగ్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఈ క్రమంలోనే అతనిపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తూ ఉండడం గమనార్హం. కాగా ఇటీవల ఇదే విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు అని చెప్పాలి. భారత డాషింగ్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్  ఏబీ డివిలియర్స్ లాంటోడు అంటూ రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించారు. ఎబి డివిలియర్స్ లాగానే 360 డిగ్రీల షాట్లు ఆడతాడు అంటూ కితాబిచ్చాడు.


 ఇటీవల కాలంలో అతను ఇన్నింగ్స్ చూస్తూ ఉంటే ఎబి డివిలియర్స్ ఆడినట్లు గానే ల్యాబ్ షాట్స్, లేట్ కట్స్, ర్యాంప్ షాట్లు ఆడుతున్నాడని ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ లో ఫ్లిక్ షాట్లు ఎంతో అద్భుతం అంటూ కొనియాడాడు. అయితే ఇప్పటికే టీమిండియాలో మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్న కారణంగా సూర్యకుమార్ యాదవ్ ను 4వ స్థానంలో దింపితే మంచిది అంటూ వ్యాఖ్యానించాడు రికీపాంటింగ్. గత కొంత కాలం నుంచి టీమిండియాలో నమ్మకమైన బ్యాట్స్మెన్గా మారిపోయిన సూర్యకుమార్ యాదవ్ మంచి ఇన్నింగ్స్ తో టీమిండియాకు మంచి విజయాలను అందిస్తున్నాడూ అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sky