ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న ఆటలలో అటు క్రికెట్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో అయితే క్రికెట్కు ఉన్న ఆదరణ రోజురోజుకు మరింతగా పెరిగిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ క్రమంలో ఇటీవల కామన్ వెల్త్ గేమ్స్ లో భాగంగా క్రికెట్కు అవకాశం దక్కింది. ఇక మహిళా క్రికెటర్లు కామన్వెల్త్ గేమ్స్ లో బాగా రాణించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఒలంపిక్ క్రీడలలో  కూడా క్రికెట్ అర్హత సాధిస్తే బాగుండు అని  ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానులు అందరికీ కూడా ఇందుకు సంబంధించిన శుభవార్త వినిపించ పోతుంది అన్నది తెలుస్తుంది. 2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరగబోయే ఒలింపిక్ క్రీడలలో క్రికెట్ ని కూడా చేర్చే అవకాశాలు ఉన్నాయి అన్నది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. అయితే ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే క్రికెట్ ఆస్ట్రేలియా బ్రిస్బేన్ వేదికగా నిర్వహించే  క్రీడలలో క్రికెట్ ను చేర్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టిందట. ఇటీవల బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో మహిళల టి20 క్రికెట్ అవకాశం కల్పించారు. కామన్ వెల్త్ గేమ్స్ లో జరిగిన టి20 టోర్నీ కాస్త విజయవంతమైంది.


 ఈ క్రమంలోనే ఒలంపిక్స్ లో కూడా క్రికెట్ చేరితే చాలా బాగుంటుందని డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సహా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇందుకు సంబంధించి విజ్ఞప్తి చేస్తూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే లాస్ ఏంజెల్స్ లో జరగబోయే 2028 ఒలంపిక్ క్రీడలలో భాగంగా క్రికెట్ కు ఒలంపిక్స్లో స్థానం కల్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకవేళ 2028లో జరగకపోయినా 2032 లో మాత్రం తప్పకుండా ఒలంపిక్స్ లో క్రికెట్ చోటు సంపాదించుకుంటుంది అని ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు 132 ఏళ్ల తర్వాత క్రికెట్ ను మళ్ళీ ఒలంపిక్స్ లో చూడవచ్చు. 1900 ఒలింపిక్ క్రీడల్లో ఒక్కసారి మాత్రమే క్రికెట్ నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: