సాధారణంగా టీమిండియా  విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఏం కావాలన్న ఇట్టే కళ్ళ ముందుకు వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు భారత్ వెళ్లిన జింబాబ్వే పర్యటనలో మాత్రం టీమిండియాకు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కారణం అక్కడ నీటి కొరత తీవ్రంగా వేధిస్తూ ఉండడమే. ప్రస్తుతం పేద దేశాల్లో ఒకటిగా కొనసాగుతున్న జింబాబ్వే లో నీటి కొరత కారణంగా ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ నల్లాల ముందు బారులు తీరి మరి ఇక నీటి కోసం నిరీక్షణ గా ఎదురుచూస్తున్నారు. కాస్త డబ్బున్న వారు ఇక దుకాణాలలో మినరల్ వాటర్ కొనుక్కొని మరి వాటితోనే వంటలు కూడా చేసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.


 ఇలాంటి సమయంలోనే కేఎల్ రాహుల్ సారథ్యంలో టీమ్ ఇండియా జింబాబ్వే పర్యటన కోసం ఆ దేశంలో అడుగు పెట్టింది. అక్కడ మూడు వన్డేల సిరీస్ ఆడబోతుంది. ఇలాంటి సమయంలోనే ఇక జింబాబ్వేలో ఏర్పడిన నీటి కొరత టీమిండియా ఆటగాళ్లకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు ఇదే విషయంపై బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది అని తెలుస్తోంది. జింబాబ్వేలో నీటి సంక్షోభం తారా స్థాయిలో ఉంది. వన్డే సిరీస్ ఉన్న హరారేలో ప్రజలు నీటి కోసం ఇక్కట్లు పడుతున్నారని మా దృష్టికి వచ్చింది.


 ఈ క్రమంలోనే జింబాబ్వే పర్యటనకు వెళ్లిన క్రికెటర్లు అందరూ కూడా నీటిని ఎంతో జాగ్రత్తగా వాడాలి అని సూచించాము. తక్కువ సమయంలోనే స్నానాలు ముగించుకొని ఇతర కార్యక్రమాలు కూడా పూర్తి చేయాలని క్రికెటర్లకు చెప్పాము. అంతేకాకుండా జింబాబ్వేలో నీటికొరత ఉన్న నేపథ్యంలో ఇక స్విమ్మింగ్ పూల్స్ లో జలకాలాటలు వంటివి రద్దు చేసామ్ అంటూ బిసిసీఐ అధికారి ఒకరు ఇటీవలే తెలిపారు. టీమిండియా విదేశీ పర్యటనకు వెళ్ళిన సమయంలో నీటి కొరత ఎదురు కావడం ఇదే తొలిసారి కాదు అనే చెప్పాలి. 2018 లో భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ నీటి కొరత ఉన్నట్లు తేలింది. ఆటగాళ్లు కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక అప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి క్రికెటర్లు అవసరాలను తీర్చారు అక్కడి అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: