ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్, వన్డే ఫార్మాట్ మాత్రమే ఉండేవి. అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఆటగాళ్లు అందరూ కూడా కేవలం ఈ ఫార్మాట్లలో మాత్రమే మ్యాచులు ఆడుతూ ఉండేవారు అని చెప్పాలి. ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్లో టెస్ట్ ఫార్మాట్ నే అత్యుత్తమ క్రికెట్ గా భావించే వాళ్ళు ప్రతి ఒక్కరు. టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం అంటే అది ఒక అదృష్టంగా భావించేవారు అని చెప్పాలి. ఎందుకంటే టెస్టు ఫార్మాట్లో  ఆటగాడికీ అత్యున్నతమైన ప్రతిభ కనబరచేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పాలి.


 అయితే అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎప్పుడైతే టీ20 ఫార్మాట్ అరంగేట్రం చేసిందో అప్పటి నుంచి ప్రపంచ క్రికెట్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్రమక్రమంగా టీ20 ఫార్మాట్ కి ఆదరణ పెరిగిపోయింది. అయితే ఇప్పుడు కేవలం టీ20 ఫార్మాట్ చూసేందుకు మాత్రమే ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. నిమిషాల వ్యవధిలో ఫలితం తేలిపోయే మ్యాచ్లను ఎక్కువగా ఆదరిస్తున్నారు. కేవలం ప్రేక్షకులు మాత్రమేనా ఆటగాళ్లు సైతం ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారు.


 టీ20 ఫార్మాట్లో ఆడితే ఒకవైపు డబ్బుతో పాటు మరో వైపు పేరు ప్రఖ్యాతలు కూడా వస్తాయని భావిస్తున్న క్రికెటర్స్  ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి టీ20 ఫార్మట్ లో కొనసాగుతున్నారు. ఈ క్రమం లోనే టెస్టులను  కాపాడాల్సిన బాధ్యత ఉంది అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. ఇటీవల ఇదే విషయం పై టీమిండియా లెజెండరీ క్రికెటర్ కపిల్దేవ్ స్పందించాడు. టి20 ఫార్మాట్ ఆదరణతో టెస్ట్, వన్డే ఫార్మాట్ ఆదరణ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వీటిని కాపాడేందుకు ఐసీసీ చర్యలు తీసుకోవాలంటూ కోరాడు. లేదంటే ఫుట్బాల్ లాగానే కేవలం ప్రపంచ కప్ లు మాత్రమే ఆడి ఇక మిగతా సమయంలో టీ20 లీగ్ లు ఆడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: