అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగబోతున్న టి20 వరల్డ్ కప్ కి ముందు ఆసియా కప్.. సినిమా ముందు విడుదలై అంచనాలు పెంచే ట్రైలర్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఆసియా కప్ లో ఏ జట్టు బాగా రాణిస్తుంది అనే విషయాన్ని బట్టి అటు వరల్డ్ కప్ లో అంచనాలు కూడా పెరిగి పోతూ ఉంటాయి. కాగా ఎన్నో రోజుల నుంచి అటు వరల్డ్ కప్ కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది భారత జట్టు. అయితే ఆసియా కప్ లో ఇప్పటి వరకు అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతుంది టీమిండియా. దీంతో ఈసారి కూడా కప్పు కొట్టేది  టీమిండియానే అని అందరూ గట్టిగా నమ్ముతున్నారు.


 అయితే ఆసియా కప్ ప్రారంభానికి ముందు వరల్డ్ కప్ గురించి భారత కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద ప్రకటన చేశాడు. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు సంబంధించి 80 నుంచి 90 శాతం సిద్ధంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తాము ఇంకా ఆసియా కప్ తో పాటు ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా తో టీ20 సిరీస్ లో ఆడాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అప్పటివరకూ జట్టు పూర్తిగా సిద్ధం అవుతుంది అంటూ తెలిపాడు. అయితే ఆస్ట్రేలియాలో పరిస్థితుల దృష్ట్యా కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే రోహిత్ శర్మ ఈ ప్రకటన చేసిన నేపథ్యంలో మహమ్మద్ షమీ,శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ కు జట్టులో చేరాలని ఆశ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో టి20 వరల్డ్ కప్ విషయంలో టీమిండియా ఎలాంటి వ్యూహాలను అనుసరించ బోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అంతేకాకుండా ఆసియా కప్లో టీమ్ ఇండియా చేసిన ప్రదర్శన అటు వరల్డ్కప్కు ఒక ప్రామాణికంగా మారే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. తద్వారా వరల్డ్ కప్ లో ఒత్తిడిని తట్టుకుని టీమిండియా ఆటగాళ్లు ఎలా రాణిస్తారో ఈ విషయంపై క్రికెట్ విశ్లేషకులు కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఆసియా కప్ లో అటు రోహిత్ శర్మను ఒక అరుదైన రికార్డు ఊరిస్తోంది. ప్రస్తుతం 883పరుగుల వద్ద ఉన్న రోహిత్ శర్మ మరో 117 పరుగులు చేశాడు అంటే 1000 పరుగులు అందుకున్న తొలి భారతీయ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: