మహమ్మద్ సిరాజ్.. భారత క్రికెట్లో ఇతనో సంచలనం అనే చెప్పాలి. ఒక ఆటోవాల  కొడుకు అని చెప్పుకునే స్థాయి నుంచి ప్రస్తుతం దేశం గర్వించదగ్గ క్రికెటర్  స్థాయికి ఎదిగాడు సిరాజ్. ఐపీఎల్ ద్వారా అతను జీవితం ఒక్కసారిగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగానే టీమిండియాలో అవకాశం దక్కించుకున్నాడు ఈ ఫాస్ట్ బౌలర్. ఇక టీమిండియా లోకి వచ్చి తక్కువ సమయంలోనే తనదైన ప్రతిభతో ఆకట్టుకుని తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అని చెప్పాలి. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సన్నిహిత స్నేహితుడిగా కూడా మహమ్మద్ సిరాజ్ అభిమానులందరికీ కొసమెరుపు.


 ఇలా అన్ని ఫార్మాట్లలో కూడా తనదైన బౌలింగ్తో ఆకట్టుకున్న సిరాజ్ గత కొంత కాలం నుంచి మాత్రం తీవ్రమైన పోటీ నేపథ్యంలో టీమిండియాలో అవకాశం దక్కించుకోలేక పోతున్నాడు. ఇక అవకాశం వచ్చినా కూడా అది కేవలం 1, 2 మ్యాచ్ లకు మాత్రమే  పరిమితం అవుతుంది. ఇక ప్రస్తుతం కాస్త జట్టుకు దూరంగానే ఉన్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ఇటీవలి కాలంలో ఎంతోమంది భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న కౌంటీ క్రికెట్ లో ఆడుతూ అదరగొడుతు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఛటేశ్వర్ పూజారా సహా వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లు  ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో  ఆడుతూ ఉన్నారు.


 ఇక ఇప్పుడు హైదరాబాది ఫేసర్  మహమ్మద్ సిరాజ్ కూడా ఇదే దారిలో వెళ్తున్నాడు అన్నది తెలుస్తుంది. తన కెరీర్లోనే తొలిసారిగా ఇంగ్లాండ్ కౌంటీలో ఆడబోతున్నాడు మహమ్మద్ సిరాజ్. కౌంటీ ఛాంపియన్షిప్ 2022 సీజన్ లోని చివరి మూడు మ్యాచ్లకు జట్టు యాజమాన్యం అతని తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. వార్విక్ షైర్ జట్టు తరఫున మహమ్మద్ సిరాజ్ ప్రాతినిథ్యం వహించపోతున్నాడు. ఈ క్రమంలోనే సిరాజ్ మాట్లాడుతూ కౌంటీలో ఆడేందుకు అనుమతి ఇచ్చిన బిసిసిఐకి ధన్యవాదాలు అంటూ తెలిపాడు. వార్ విక్ షైర్ జట్టులో చేరేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: