ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో భారత్ పై విజయం సాధించాలని కసితో ఉన్న పాకిస్థాన్ జట్టు ఇటీవలే సూపర్ 4 భాగంగా భారత్తో మరోసారి మ్యాచ్ ఆడింది. ఇక ఈ మ్యాచ్లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గత ఆదివారం ఓటమికి ఈ ఆదివారం మ్యాచ్ లో ప్రతీకారం తీర్చుకుంది అని చెప్పాలి. ఇలా ఆసియా కప్ మొదలైన నాటి నుంచి కూడా రెండు ఆదివారాలు ప్రేక్షకులకు దాయాదుల పోరు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వచ్చే ఆదివారం ఆసియా కప్ ఫైనల్ జరగబోతుంది.
ఇక ఈ పైనలో లో కూడా భారత్-పాకిస్థాన్ జట్లు మరో సారి తలబడపోతున్నాయి అని అటు ప్రేక్షకులు అందరూ కాస్త గట్టిగానే నమ్ముతున్నారు అని చెప్పాలి.ఇక ఈ ఆసియా కప్ ఫైనల్లో ఏ జట్లు ఉన్నా కూడా మ్యాచ్ మాత్రం ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం సూపర్ 4లో ఇండియా పాకిస్తాన్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. అయితే భారత్ పాకిస్థాన్ జట్ల ఫైనల్ చేరుతాయ లేదా ఇవి కాకుండా మరో రెండు జట్లు ఫైనల్లో అడుగుపెడతాయా అనేది ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి దీంతో ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తున్నారు ప్రేక్షకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి